దుష్ట శక్తులను తొలగిస్తానంటూ ఒక వ్యక్తి మాయమాటలు చెప్పి ఒక మానసిక వికలాంగుడుని పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన చత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే...రతన్‌పూర్ పోలీస్టేషన్ పరిధిలోని పోడి గ్రామంలో ఫేకురామ్ నిర్మల్కర్ అనే 35 ఏళ్ల మానసిక వికలాంగడు ఉన్నాడు. అతని భార్య ఒక రషక్ అనే తాంత్రికుడిన సంప్రదించింది. అతన్ని దుష్ట ఆత్మల ప్రభావానికి లోనయ్యాడని వాటిని తొలగించాలని చెప్పాడు. దీంతో అతని వద్దకు తన భర్త ఫేకురామ్‌ని తీసుకువెళ్లింది. ఆ తాంత్రికుడు వద్దే నాలుగు రోజుల వచ్చింది.
ఆ తాంత్రికుడు దుష్టశక్తులను తొలగించే పేరుతో త్రిశూలంతో వాతలు పెట్టి హింసించడం మొదలు పెట్టాడు. ఐతే ఫేకురామ్‌కి వాతలు కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చి పరిస్థితి విషమించడంతో అతని బార్య ఫేకురామ్ ఇంటికి తీసుకువెళ్లిపోయింది. ఆ తర్వాత అతను చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని హత్యనేరం కింద కేసు నమోదు చేసుకుని తాంత్రికుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
(చదవండి: ఈవీఎం పాడవ్వడంతో తలెత్తిన ఘర్షణ...పలువురికి గాయాలు)
Comments
Please login to add a commentAdd a comment