Evil spirit
-
దారుణం: దుష్ట శక్తుల పేరుతో త్రిశూలంతో వాతలు...వ్యక్తి మృతి
దుష్ట శక్తులను తొలగిస్తానంటూ ఒక వ్యక్తి మాయమాటలు చెప్పి ఒక మానసిక వికలాంగుడుని పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన చత్తీస్‌గఢ్ బిలాస్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...రతన్‌పూర్ పోలీస్టేషన్ పరిధిలోని పోడి గ్రామంలో ఫేకురామ్ నిర్మల్కర్ అనే 35 ఏళ్ల మానసిక వికలాంగడు ఉన్నాడు. అతని భార్య ఒక రషక్ అనే తాంత్రికుడిన సంప్రదించింది. అతన్ని దుష్ట ఆత్మల ప్రభావానికి లోనయ్యాడని వాటిని తొలగించాలని చెప్పాడు. దీంతో అతని వద్దకు తన భర్త ఫేకురామ్‌ని తీసుకువెళ్లింది. ఆ తాంత్రికుడు వద్దే నాలుగు రోజుల వచ్చింది. ఆ తాంత్రికుడు దుష్టశక్తులను తొలగించే పేరుతో త్రిశూలంతో వాతలు పెట్టి హింసించడం మొదలు పెట్టాడు. ఐతే ఫేకురామ్‌కి వాతలు కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చి పరిస్థితి విషమించడంతో అతని బార్య ఫేకురామ్ ఇంటికి తీసుకువెళ్లిపోయింది. ఆ తర్వాత అతను చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని హత్యనేరం కింద కేసు నమోదు చేసుకుని తాంత్రికుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: ఈవీఎం పాడవ్వడంతో తలెత్తిన ఘర్షణ...పలువురికి గాయాలు) -
దెయ్యం వదిలిస్తానంటూ.. రూ. 73 లక్షలు స్వాహా
కువైట్: మనిషి అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా.. మూఢనమ్మకాలను మాత్రం జయించలేకపోతున్నాడు. శాస్త్రం కంటే మంత్రతంత్రాల మీదే నమ్మకం ఎక్కువ చాలా మందికి. అందుకే మన దగ్గర శాస్త్రవేత్తల కన్నా బాబాలు, స్వామీజీలకు ఆదరణ, గుర్తింపు ఎక్కువ. శాంతి చేస్తాం.. దెయ్యాలను వదిలిస్తామంటూ జనాల దగ్గర డబ్బులు గుంజే వారికి కొదవే లేదు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దెయ్యం వదిలిస్తామంటూ ఏకంగా 73 లక్షల రూపాయలు స్వాహా చేశాడో వ్యక్తి. ఈ ఘటన కువైట్‌లో చోటు చేసుకుంది. స్థానిక మీడియా కైరో రిపోర్ట్స్ ప్రకారం ఓ మహిళ తన ఒంట్లో దెయ్యం ప్రవేశించిందని.. అది తనను కంట్రోల్ చేస్తుందని దాని వల్ల ఏం చేస్తున్నానో తనకే తెలియకుండా పోతుందంటూ స్నేహితురాళ్ల దగ్గర చెప్పుకుని బాధపడింది. దాంతో ఆమె స్నేహితులు తమకు ఓ తాంత్రికుడు తెలుసని.. దెయ్యాలు వదిలించడంలో అతడు ఎక్స్పర్ట్ అని చెప్పి.. సదరు మహిళను అతడి దగ్గరకు తీసుకెళ్తారు. తాంత్రికుడు దెయ్యం వదిలిస్తానని దానికి బాగా ఖర్చవుతుందని వారికి తెలుపుతాడు. ఈ క్రమంలో మహిళ తొలత 4 వేల దినార్లు అతడి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాంతో అతడు దెయ్యం వదిలించే కార్యక్రమం ప్రారంభిస్తాడు. ఏవోవే పూజలు చేసి.. దెయ్యాన్ని పారదోలానని చెప్పాడు. ఆ తర్వాత ఆమె దగ్గర నుంచి మరో 26 వేల దినార్లు తీసుకున్నాడు. ఇలా మొత్తం 30 వేల దినార్లు(73 లక్షల రూపాయలు) స్వాహా చేశాడు. ఆ తర్వాత కూడా మహిళకు తన ఆరోగ్యంలో పెద్దగా మార్పు వచ్చినట్లు కనిపించకపోవడంతో.. తాను మోసపోయానని గ్రహిస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన స్నేహితురాళ్లు, సదరు మాంత్రికుడి మీద ఫిర్యాదు చేస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు బాధితురాలి స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఆ దెయ్యం బొమ్మ తిరిగి వచ్చేసిందా? -
ఆ దెయ్యం బొమ్మ తిరిగి వచ్చేసిందా?
చారడేసి కళ్లు, నిండైన ముఖం, నున్నటి కురులు.. చదువుతుంటే బాగానే ఉన్నప్పటికీ దేని కోసం వర్ణిస్తున్నామో చెప్తే మాత్రం ఒక్కసారిగా అదిరిపడటం ఖాయం. అవును, ఈ వర్ణన అంతా భయంకరమైన "అనబెల్లె" బొమ్మ గురించి. చూడటానికి కొంచెం ముద్దుగా ఎంతో భయంగా కనిపించే అనబెల్లె ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. అనబెల్లె సిరీస్‌లో ఆ బొమ్మ మనుషులకు ఎలాంటి హాని తలపెట్టకుండా మ్యూజియంలోని అద్దపు గదిలో బందీ చేస్తారు. సినిమాలోని అనబెల్లె నిజ జీవితంలోనూ ఉంది. (రూపాయి ఖర్చు లేకుండా ఆడిలో షికారు!) me, laughing at Anabelle's memes knowing that she's escaped from the museum and that she's probably under my bed trying to kill me. pic.twitter.com/LhlU0fLMN5 — 𝘱𝘶𝘴𝘴𝘺 𝘦𝘯𝘰𝘫𝘢𝘥𝘢 (@anticondones) August 14, 2020 రెండు పైకి తేలిన కళ్లు, ఎర్ర జుట్టుతో ఉన్న ఓ దెయ్యం బొమ్మ ఆధారంగా అనబెల్లె తెరకెక్కింది. 1970లో నర్సింగ్ కాలేజీ విద్యార్థి ఈ బొమ్మను బహుమతిగా అందుకుంది. కానీ అతీంద్రియ శక్తులు ఉన్న ఆ బొమ్మ వల్ల ఎన్నో భయంకర ఘటనలు వెలుగు చూశాయి. దీంతో దాన్ని ఎలాగోలా అమెరికాలోని కనెక్టికట్‌లో వారెన్స్ ఆక్లట్ మ్యూజియమ్‌లో ఉంచారు. Now who is spreading rumors Anabelle escaped from Warren's museum and is now haunting in Human form !! 🤷♂️ pic.twitter.com/QmKNCsxChR — Soum Jaiswal (@_JaiswalSoum_) August 14, 2020 అయితే ఇన్నేళ్ల తర్వాత ఆ బొమ్మ మ్యూజియంలో నుంచి బయటపడిందని, ఇంతకాలం దాన్ని బంధించినందుకు ఎవరినీ వదిలిపెట్టదంటూ నెటిజన్లు హడలిపోతున్నారు. ఆ బొమ్మలోని ఆత్మ ఎంతమందిని వెంటాడనుందో అని గజగజ వణికిపోతున్నారు. 2020లో ఇంతకన్నా ఘోరం ఇంకోటి లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం అనబెల్లె పారిపోయి వచ్చినా బయట పరిస్థితి చూసి మళ్లీ మ్యూజియంలోకి పరుగు పెడుతుందంటూ జోకులు పేల్చుతున్నారు. వాస్తవానికి అనబెల్లె బొమ్మ మ్యూజియంలోనే ఉంది. కానీ కొందరు కావాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఆ బొమ్మ బయటకు వచ్చిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. (చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్ బంక్) Of course she escaped. This doll has been building supernatural power up for decades. Example: Kills a dude on a motorcycle for tapping her glass. #anabelle pic.twitter.com/QVqCA4JCph — Trik (@TrikLive) August 14, 2020 You’re telling me this raggy ass dirty ass old ass doll escaped. #anabelle Annabelle said : 🏃♀️🏃♀️🏃♀️🏃♀️🏃♀️🏃♀️🏃♀️🏃♀️ pic.twitter.com/QRam9zXiYH — 🇬🇹🦂SAKURA! (@dababychapina) August 14, 2020 anabelle going back to the museum after seeing the state of the world pic.twitter.com/b1kFPdduQM — sal (@aripjnk) August 14, 2020 me staring at the pile of clothes on my chair trying to figure out whether it’s anabelle or just clothes pic.twitter.com/b9CxRl2C1j — emma ᶜ (@WlLDFLOWERLFTV) August 14, 2020 Anabelle if you reading this.. I have love for you bro! I didn’t mean anything I said about you! I was just hangry #anabelle pic.twitter.com/4GkngtEIJG — QueenBeast (@QueenBeast88) August 14, 2020 rt this or else Anabelle will sleep beside you at 3am pic.twitter.com/1qLmlOhZ4h — pretty eerie (@hanhyojooo) August 14, 2020 -
‘పాప శరీరంలో దెయ్యం ఉంది’
లక్నో : శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా.. అంతరిక్షంలోకి వెళ్లినా మన సమాజంలో పాతుకుపోయిన కొన్ని ముఢనమ్మకాలను మాత్రం తొలగించలేకపోతున్నాం. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా భూత వైద్యులను, బాబాలను ఆశ్రయిస్తున్నారు. వారు ఇచ్చే పనికిమాలిన సలహాల ప్రకారం మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ఇలాంటి సంఘటనే ఒకటి షాజహాన్ పూర్లో చోటు చేసుకుంది. నెలల పసికందుకు జబ్బు చేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాల్సింది పోయి భూతవైద్యున్ని కలిశారు తల్లిదండ్రులు. అతడు కాస్తా పాప శరీరంలో చెడు ఆత్మ ఉంది. దాని వల్ల మీ కుటుంబానికి నష్టం వాటిల్లుతుందని చెప్పాడు. పాపను వదిలించుకోకపోతే ప్రాణ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించాడు. దాంతో ఊరి దగ్గర ఉన్న చెరువులో పాపను పడేసేందుకు నిశ్చయించుకున్నాడు కసాయి తండ్రి. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ లోపు అక్కడికి చేరుకోవడంతో చిన్నారిని సురక్షితంగా కాపాడారు. అనంతరం పాప తండ్రితో పాటు, మాంత్రికున్ని కూడా అరెస్ట్ చేశారు. -
దయ్యం కాదు.. ఉద్యోగం ఊడింది!
జైపూర్: రాజస్తాన్‌లో ఓ డాక్టర్ భూత వైద్యుడి అవతారమెత్తాడు. స్పృహ కోల్పోయిన ఓ మహిళకు మెలకువ తెప్పించడానికి చెంపదెబ్బలు కొట్టాడు. దీంతో సదరు వైద్యుడి ఉద్యోగం ఊడింది. బార్మెర్ జిల్లాలో బుధవారం సాయంత్రం స్పృహ కోల్పోయిన ఓ మహిళను ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెను దుష్ట శక్తులు ఆవహించినట్లు విధుల్లో ఉన్న డాక్టర్ సురేంద్ర బహ్రీకి చెప్పారు. దీంతో సదరు మహిళను స్పృహలోకి తీసుకురావడానికి బహ్రీ చెంపదెబ్బలు కొట్టారు. ఈ సమయంలో బహ్రీ ఎలాంటి వైద్య నిబంధనలను పాటించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ కోసం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ తన నివేదికను డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్‌కు సమర్పించింది. దీంతో సదరు వైద్యుడిని విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కాళిచరణ్ సరాఫ్ ఆదేశించారు. బహ్రీని వెయిటింగ్ పోస్టింగ్ ఆర్డర్(ఏపీఓ)లో ఉంచాలని తెలిపారు. -
దెయ్యం పట్టిందని మహిళను చితకబాదాడు
జైపూర్: దెయ్యం పట్టిందని, దీన్ని వదిలిస్తానని చెప్పి ఓ మాంత్రికుడు చైన్ తీసుకుని మహిళను చితకబాదాడు. రాజస్థాన్‌లో రాజసమండ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 32 ఏళ్ల కస్ని అనే మహిళ కొంతకాలంగా అనారోగ్యంతో ఉంది. కుటుంబ సభ్యులు ఆమెను ఓ మాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆమెకు దెయ్యం ఆవహించిందని, దీన్ని వదిలించేందుకు వైద్యం చేయాలని మాంత్రికుడు చెప్పాడు. బుధవారం రాత్రి మంత్రాల పేరుతో ఆమెను రెండు గంటలకుపైగా ఇనుప చైన్‌తో చితకబాదాడు. ఆ తర్వాత ఆమె జట్టు పట్టుకుని ఈడ్చాడు. ఈ దెబ్బలకు ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో, మాంత్రికుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు ఆమెను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. -
'కబాలి' కోసం బలి!
సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' కళ్లు చెదిరే రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. రిలీజ్‌కు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమా కథ పరంగా కాస్త నిరాశపరచినా.. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దాంతో తలైవా ఫ్యాన్స్ సంబరాలు జరుపుకొంటున్నారు. సూపర్ స్టార్‌ను అభిమానించేవారికన్నా ఆరాధించేవారి సంఖ్యే ఎక్కువన్న విషయం తెలిసిందే. ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు.. రజనీ విగ్రహాలకు పాలాభిషేకాలు, హారతులు కామన్. ఈసారి మరో అడుగు ముందుకేసి జంతు బలికి పూనుకున్నారు రజనీ ఫ్యాన్స్. కబాలి భారీ సక్సెస్ అయ్యి, రికార్డు కలెక్షన్లు రాబడుతున్నందున దిష్టి తగలకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో మేకలను దేవుడికి బలి ఇస్తున్నారట ఫ్యాన్స్. ఎలాంటి చెడు చూపు సినిమా కలెక్షన్లపై పడకుండా, ఎటువంటి చెడు జరుగకుండా ఉండాలని కోరుకుంటూ మేకలను బలిచ్చే పనిలో ఉన్నారు సూపర్ స్టార్ వీరాభిమానులు. అయితే మూగజీవాలను ఇలా హింసించడం పట్ల జంతు ప్రేమికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఫ్యాన్స్ అనాలోచిత కార్యక్రమాలను ఆపేందుకు తలైవానే నడుం బిగించాలని పలువురు కోరుకుంటున్నారు.