దయ్యం కాదు.. ఉద్యోగం ఊడింది! | Rajasthan doctor pulls up woman patient by hair, slaps to ‘rid her of evil spirits’ | Sakshi
Sakshi News home page

దయ్యం కాదు.. ఉద్యోగం ఊడింది!

Published Fri, Jun 30 2017 7:23 PM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

దయ్యం కాదు.. ఉద్యోగం ఊడింది!

దయ్యం కాదు.. ఉద్యోగం ఊడింది!

జైపూర్‌: రాజస్తాన్‌లో ఓ డాక్టర్‌ భూత వైద్యుడి అవతారమెత్తాడు. స్పృహ కోల్పోయిన ఓ మహిళకు మెలకువ తెప్పించడానికి చెంపదెబ్బలు కొట్టాడు. దీంతో సదరు వైద్యుడి ఉద్యోగం ఊడింది. బార్మెర్‌ జిల్లాలో బుధవారం సాయంత్రం స్పృహ కోల్పోయిన ఓ మహిళను ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెను దుష్ట శక్తులు ఆవహించినట్లు విధుల్లో ఉన్న డాక్టర్‌ సురేంద్ర బహ్రీకి చెప్పారు. దీంతో సదరు మహిళను స్పృహలోకి తీసుకురావడానికి బహ్రీ చెంపదెబ్బలు కొట్టారు.

ఈ సమయంలో బహ్రీ ఎలాంటి వైద్య నిబంధనలను పాటించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ కోసం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ తన నివేదికను డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌కు సమర్పించింది. దీంతో సదరు వైద్యుడిని విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కాళిచరణ్‌ సరాఫ్‌ ఆదేశించారు. బహ్రీని వెయిటింగ్‌ పోస్టింగ్‌ ఆర్డర్‌(ఏపీఓ)లో ఉంచాలని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement