Barmer district
-
రాజస్తాన్‌లో ఘోరం.. మహిళపై రేప్.. ఆపై సజీవదహనం
జైపూర్: రాజస్తాన్‌లో ఘోరం జరిగింది. ఓ దుర్మార్గుడు దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమెకు నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. బార్మెర్ జిల్లాకు చెందిన దళిత మహిళ(30) ఈ నెల 6న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన షకూర్‌ఖాన్ అనే వ్యక్తి బలవంతంగా లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడిన అనంతరం యాసిడ్ వంటి ద్రావకాన్ని ఒంటిపై పోసి, నిప్పంటించి పరారయ్యాడు. 50 శాతం గాయాలపాలైన బాధితురాలు జోథ్‌పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడు ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
షాకింగ్.. 2 గంటల్లో 40 మందిని కరిచిన వీధి కుక్క.. కిక్కిరిసిన ఆసుపత్రి వార్డ్
జైపూర్: కుక్కలు మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. పెంపుడు శునకాలు, వీధి కుక్కలనే తేడా లేకుండా ఉన్నట్టుండి యజమానులు, బయట వారిపై దాడి చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. కేవలం 2 గంటల్లోనే ఏకంగా 40 మందిని కరిచింది. ఈ ఘటన బార్మర్ జిల్లాలోని కళ్యాణ్పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వీధి కుక్క దాడితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుక్క దాడిలో గాయాలపాలైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులతో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు నిండిపోయింది. దీంతో స్థానికంగా పరిస్థితి ఏ స్థాయికి చేరిందనేది వెల్లడవుతోంది. అకస్మాత్తుగా వీధికుక్క దాడి చేయడంతో చాలా మంది గాయపడ్డారని, వారందరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని సదరు హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బిఎల్ మన్సూరియా తెలిపారు. ఈ ఘటనపై వెంటనే నగర పాలక సంస్థకు సమాచారం అందించడంతో అధికారులు రంగంలోకి దిగారు. కుక్కను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఆసుపత్రి సిబ్బంది సహాయంతో వీధికుక్కను పట్టుకున్నారు. తాజా ఘటనతో నగరంలోని కుక్కల బెడద ఎక్కువగా ఉన్న వివిధ ప్రాంతాల్లో వాటిని పట్టుకునేందుకు నగర పాలక సంస్థ చర్యలు చేపట్టింది. చదవండి: దారుణం.. ఇంటి యజమానిని చితకబాది.. నోట్లో పినాయిల్ పోసి.. -
7లక్షలకు 13 ఏళ్ల కూతురిని అమ్మేశాడు!
బర్మార్: కన్నకూతురిని రూ. 7 లక్షలకు అమ్మేసిన ఓ దుర్మార్గపు తండ్రి ఉదంతమిది. రాజస్థాన్ బర్మార్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తండ్రి చేత అమ్మివేయబడిన 13 ఏళ్ల బాలిక ఎట్టకేలకు హైదరాబాద్‌లో దొరికింది. పోలీసులు బాలికను కనుగొనే సమయానికి.. ఆ చిన్నారి నాలుగు నెలల గర్భవతిగా ఉంది. ఈ ఘటనలో తండ్రితో సహా మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ‘బాలికను కనుగొనడంతోపాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ఆమెను బర్మార్‌కు తీసుకొచ్చి తల్లికి అప్పగించాం. ఈ నెల 15న బాలికను కోర్టు ముందు ప్రవేశపెడతాం’ అని బర్మార్ ఎస్పీ శరద్ చౌదరి తెలిపారు. బాలిక ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతిగా ఉందని సివానా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో దావూద్ ఖాన్ తెలిపారు. బాలికను తప్పిపోయినట్టు సివానా పోలీసు స్టేషన్లో గత జూన్ 30వతేదీన కేసు నమోదైంది. తన అన్న కూతురు జూన్ 22వ తేదీ నుంచి కనిపించడం లేదని బాలిక బాబాయి కేసు నమోదు చేశారు. ఓ ప్రముఖ కుటుంబంతో పెళ్లి జరిపిస్తానని దళారి గోపా రామ్ మాలి తన అన్నకు చెప్పాడని, దీంతో వరుడి కుటుంబంతో మాట్లాడి వస్తానంటూ కూతురిని తీసుకొని తన అన్న సివానాకు వెళ్లాడని, అనంతరం ఆయన తిరిగొచ్చాక కూతుర్ని వెంట తీసుకురాలేదని, బాలిక ఏదని అడిగితే మామయ్య ఇంట్లో వదిలేసి వచ్చానని తన అన్న చెప్పాడని ఆయన ఎఫ్ఐఆర్లో వివరించారు. జూన్ 26వ తేదీన మామయ్య ఇంట్లో కూడా బాలిక లేదని తెలియడంతో బాలిక తండ్రిని ప్రశ్నించగా.. బాలికను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పాడంటూ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దీంతో జూలై మొదటివారంలోనే బాలిక తండ్రితోపాటు దళారి గోపరామ్ మాలి, బాలికను కొనుగోలు చేసిన సన్వ్లా రామ్ దస్పాను పోలీసులు అరెస్టు చేసి.. జైలుకు పంపారు. బాలికను రూ. 7లక్షలకు అమ్మినందుకు తండ్రిపైన, కొనుగోలు చేసినందుకు నిందితులపైనా అభియోగాలు మోపారు. అయితే, బాలికను మాత్రం పోలీసులు కనుగొనలేకపోయారు. దీంతో బాలిక బాబాయి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ నెల 15లోపు బాలికను కనుగొనాలంటూ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో హైదరాబాద్‌లో బాలికను గుర్తించిన రాజస్థాన్ పోలీసులు.. బాలికతోపాటు ఉన్న దస్పా కొడుకుపై సెక్షన్ 363 (కిడ్నాప్), 366 (మహిళను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవడం), 384 (ఎక్స్టార్షన్) తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు. -
ఓటర్లను ఓ ఆట ఆడిస్తున్నారు!
సాక్షి, జైపూర్ : రాజస్తాన్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఓటర్లు తమ ఓటు హక్కును సరిగా వినియోగించుకోవటానికి, ఓట హక్కు లేని వారు కొత్తగా ఓటు హక్కు పొందటానికి ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం అవగాహన సద్సులు, కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. అయితే బర్మార్ జిల్లాలోని ప్రభుత్వ అధికారులు ఓ అడుగు ముందకు వేశారు. ఓటర్లను ఉత్సాహరుస్తూ వారికి అవగాహన కల్పించటానికి ‘‘ వైకుంఠపాళి’’ ఆటను ఆడిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 1600 అడుగుల చదరపు అడుగుల ఆటకు సంబంధించిన బోర్డును ఏర్పాటుచేశారు. ఆట వైకుంఠపాళిని పోలి ఉన్నా నియమాలు కొద్దిగా వేరు. అక్కడ పాము కరవటం శిక్ష అయితే.. ఇక్కడ మాత్రం ఓటరుగా నమోదు చేసుకోకపోవటం, డబ్బుకు ఓటును అమ్ముకోవటం, మద్యం కోసం అమ్ముకోవటం వంటివి ఇక్కడ పాము కాట్లు. ఇక నిచ్చెన ఎక్కటమంటే ఓటు హక్కు ప్రజాస్వామ్య పద్ధతిలో వినియోగించుకోవటం తోటి వారికి సైతం ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించటం వంటివి. ఈ అవగాహన కల్పించే ఆట ‘‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్’’లో సైతం చోటు సంపాదించుకుంది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, త్వరలో అన్ని నియోజకవర్గాల్లో ఈ ఆట ద్వారా అవగాహన కల్పించటానికి ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రధాని మోదీ సభకు రూ.7.23 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు జైపూర్‌లో పాల్గొననున్న సభకు కేవలం జనాన్ని సమీకరించడం కోసమే రాజస్థాన్ ప్రభుత్వం 7.23 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేస్తున్నది. ఆహారం, వసతి ఏర్పాటు చేయడానికి ఇంతకన్నా ఎక్కువ సొమ్మును వెచ్చించనున్నట్లు తెల్సింది. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పాలనా విభాగం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి మీడియాకు చిక్కడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. పలు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందిన దాదాపు రెండున్నర లక్షల మంది ప్రజలను ప్రధాని సభకు తరలించేందుకు ఏర్పాటు చేశారు. వీరందరికి రవాణా సౌకర్యంతోపాటు ఆహారం, వసతి సౌకర్యాలు జైపూర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకరావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5,579 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పథకాల లబ్ధిదారులతో నేరుగా ముచ్చటించడంతోపాటు స్మార్ట్‌సిటీ కార్యక్రమం పేరట ఓ ర్యాలీని కూడా ప్రారంభిస్తారు. ప్రధాన మంత్రి సభకు మరో ఐదువేల మంది లబ్ధిదారులను పంపించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను కోరుతూ బర్మర్ జిల్లా యంత్రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 24 లక్షల రూపాయల చెక్కును పంపించింది. ఇక ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు మహిళలను ఎంపిక చేసి వారికి తర్ఫీదు ఇచ్చింది. ప్రధానితోని ప్రశాంతంగా సానుకూలంగా మాట్లాడాలని కోరారు. వారిలో మంజూదేవి కూడా ఉన్నారు. ‘నాకు కూతురు పుట్టినందుకు రాజ్శ్రీ యోజన కింద రెండున్నర వేల రూపాయల చొప్పున రెండు వాయిదాలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఐదు వేల రూపాయలు మాత్రమే తీసుకున్న నేను 50 వేల రూపాయలు తీసుకున్నానని ఎలా చెబుతాన’ని ఆమె స్పష్టం చేయడంతో గురువారం నాడు ఆమెను ప్రధానితో మాట్లాడే వారి జాబితా నుంచి తొలగించారు. ప్రధానితో మాట్లాడే ఐదుగురికి తర్ఫీదు ఇచ్చినట్లు రాజస్థాన్ సమాచార శాఖ డిప్యూటి డైరెక్టర్ సత్యనారాయణ చౌహాన్ అంగీకరించారు. ప్రధానితో మాట్లాడేందుకు వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి కూడా విద్యార్థినులను ఎంపిక చేస్తున్నామని ఆయన తెలిపారు. వివిధ కేంద్ర పథకాల కింద లబ్ధి పొందిన రాజస్థాన్ వాసుల్లో 90 శాతం మంది బీజేపీ కార్యకర్తలే ఉన్నారని, రానున్న రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రధాని సభకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ఏర్పాట్లు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
దయ్యం కాదు.. ఉద్యోగం ఊడింది!
జైపూర్: రాజస్తాన్‌లో ఓ డాక్టర్ భూత వైద్యుడి అవతారమెత్తాడు. స్పృహ కోల్పోయిన ఓ మహిళకు మెలకువ తెప్పించడానికి చెంపదెబ్బలు కొట్టాడు. దీంతో సదరు వైద్యుడి ఉద్యోగం ఊడింది. బార్మెర్ జిల్లాలో బుధవారం సాయంత్రం స్పృహ కోల్పోయిన ఓ మహిళను ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెను దుష్ట శక్తులు ఆవహించినట్లు విధుల్లో ఉన్న డాక్టర్ సురేంద్ర బహ్రీకి చెప్పారు. దీంతో సదరు మహిళను స్పృహలోకి తీసుకురావడానికి బహ్రీ చెంపదెబ్బలు కొట్టారు. ఈ సమయంలో బహ్రీ ఎలాంటి వైద్య నిబంధనలను పాటించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ కోసం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ తన నివేదికను డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్‌కు సమర్పించింది. దీంతో సదరు వైద్యుడిని విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కాళిచరణ్ సరాఫ్ ఆదేశించారు. బహ్రీని వెయిటింగ్ పోస్టింగ్ ఆర్డర్(ఏపీఓ)లో ఉంచాలని తెలిపారు.