Trident
-
కర్ణాటకనే దిక్కు! ‘ట్రైడెంట్’లో ఊసేలేని చెరకు క్రషింగ్..
సంగారెడ్డి: జహీరాబాద్‌లోని ‘ట్రైడెంట్’ యాజమాన్యం క్రషింగ్‌ను చేపట్టే పరిస్థితి కనిపించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు పక్క రాష్ట్రాలకు చెరకును తరలిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ప్రజా ప్రతినిధులు మర్చిపోవడంతో రైతాంగం వారిపై ఆశలు వదులుకొని తమ దారి తామే చూసుకుంటున్నారు. ఇప్పటికే పలు కర్మాగారాలతో ఒప్పందం సైతం చేసుకున్నారు. జహీరాబాద్ జోన్ పరిధిలో సుమారు 18 వేల ఎకరాల్లో చెరకు పంట సాగులో ఉంది. 7 లక్షల టన్నుల మేర చెరకు పంట ఉత్పత్తి కానుంది. ఇంత మొత్తంలో పంట జోన్ పరిధిలో ఉండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పక్కనే ఉన్న కర్ణాటకకు పంటను తరలిస్తున్నారు. కర్ణాటకలోని చించోళి, బరూర్, మన్నాక్కెల్లి, గాంధీ చక్కెర కర్మాగారాలకు పంటను పంపిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, యాజమాన్యంపై ఆశలు వదులుకొని ఇప్పటికే జోన్ పరిధిలో సాగులో ఉన్న దాంట్లో 8 వేల ఎకరాల పంటను పక్కనే ఉన్న కర్ణాటకలోని చించోళి యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. జోన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లో రైతులు చెరకు పంటను విస్తారంగా సాగు చేసుకున్నారు. కర్ణాటకలోని యాజమాన్యాలు టన్నుకు ధర రూ.2,650 మేర చెల్లించి, చెరకు కోత, రవాణా ఖర్చులను వారే భరిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. రూ.9 కోట్ల మేర బకాయి.. ‘ట్రైడెంట్’ కర్మాగారంలో 2022–23 క్రషింగ్ సీజన్‌కు గాను 2.55 లక్షల టన్నుల చెరకును గాను గాడించింది. టన్నుకు రూ.3,270 ధర నిర్ణయించింది. మొదటి విడత కింద టన్నుకు రూ.3 వేల వంతున చెల్లిస్తూ వచ్చింది. మిగితా రూ.270 పెండింగ్ పెట్టింది. జనవరి నెలాఖరు, ఫిబ్రవరి మాసంలో చెరకును సరఫరా చేసిన రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో బిల్లులు పడ్డాయి. జోన్ పరిధిలో ఉన్న మొత్తం 2,287 మంది రైతులు కర్మాగారానికి చెరకును సరఫరా చేశారు. ఇందులో 1,699 మంది రైతులకు టన్నుకు రూ.270 వంతున బకాయి పడింది. మిగిలిన రైతులకు పూర్తిస్థాయిలో బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. రూ.83 కోట్లకు గాను రైతాంగానికి ఇప్పటి వరకు రూ.74 కోట్ల మేర చెల్లించారు. ఇంకా రూ.9 కోట్ల మేర బకాయిలను చెల్లించాల్సి ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఇచ్చిన హామీని మరిచిన నేతలు! ఎన్నికల సందర్భంగా కర్మాగారంలో క్రషింగ్‌ను చేపట్టేలా చర్యలు తీసుకుంటామని, మొత్తం చెరకు బకాయిలు ఇప్పిస్తామని రైతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చి మర్చిపోయారని రైతులు వాపోతున్నారు. పలు సమావేశాల్లో ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి దేవిప్రసాద్ హామీ ఇచ్చారని రైతులు పేర్కొంటున్నారు. అవసరం అయితే తమ ఆస్తులను అమ్మి బకాయిలు చెల్లిస్తామని మాట ఇచ్చారని, వారు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలోనే క్రషింగ్ జరిపేలా చూస్తామని చెప్పినట్లు గుర్తు చేస్తున్నారు. అధికారులు హామీ ఇచ్చి.. ఎన్నికల ప్రచారం నిమిత్తం నవంబర్ 23వ తేదీన జహీరాబాద్‌కు అప్పటి సీఎం కేసీఆర్ ప్రచారం నిమిత్తం వస్తుండడంతో సభను అడ్డుకునేందుకు రైతులంతా తీర్మానించారు. డిసెంబర్ మొదటి వారంలో బకాయిలను ఇప్పించడంతోపాటు క్రషింగ్‌ను జరిపిస్తామని ఎమ్మెల్యే మాణిక్‌రావు, కేన్, పోలీసు అధికారులు హామీ ఇచ్చి తమ ఆందోళనను విరమింపజేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఎవరూ పట్టించుకోవడం లేదు. – కొండల్‌రెడ్డి, రైతుసంఘం నాయకుడు, జహీరాబాద్ ఇవి చదవండి: వలస.. ఏదీ భరోసా? -
మెడలో గుచ్చుకున్న త్రిశూలం.. అలాగే 65 కి.మీ. ప్రయాణించి..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మెడలోకి గుచ్చుకున్న త్రిశూలంతో ఓ వ్యక్తి ఏకంగా 65 కిలోమీటర్లు ప్రయాణించాడు. కళ్యాణి ప్రాంతానికి చెందిన భాస్కర్ రామ్‌కు గత వారం కోల్‌కతాలోని నీలరతన్ సర్కార్ మెడికల్ కాలేజీలో అత్యవసర శస్త్ర చికిత్స జరిగింది. మెడకు త్రిశూలం గుచ్చుకున్న ఉన్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో త్రిశూలం వ్యక్తి మెడకు కుడివైపు నుంచి గుచ్చుకొని ఎడమ వైపుకు బయటకు దిగింది. గొంతు దగ్గర ఇరుక్కుపోయిన త్రిశూలాన్ని బయటకు తీసేందుకు అతను కళ్యాణి ప్రాంతం నుంచి కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీకి 65 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. గొంతు దగ్గర చిక్కుకున్న త్రిశూలంతో యువకుడు నవంబర్ 28 తెల్లవారుజామున తమ వద్దకు వచ్చినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 30 సెంటిమీటర్ల పొడవున్న త్రిశూలం గుచ్చుకొని, మెడపై రక్తం కారుతున్న స్థితిలో రామ్‌ని చూసిన వైద్య సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు పేర్కొన్నారు. అయితే భాస్కర్ రామ్ ప్రాణాలతో బయటపడడంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్రిశూలం శరీర అవయవాలు, సిరలు,ధమనులను డ్యామెజ్ చేయకపోవడంతో ఈ కేసు మెడికల్ వండర్‌గా భావిస్తున్నారు. అంతర్గతంగా కూడా పెద్దగా నష్టం జరగలేదని వైద్యులు తెలిపారు. కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు త్రిశూలాన్ని తొలగించేందుకు అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. కంటి-ముక్కు-గొంతు(ఈఎన్టీ)స్పెషలిస్ట్ డాక్టర్,అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ప్రణబాసిస్ బంద్యోపాధ్యాయ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. కొన్ని గంటలపాటు సాగిన ఈ శస్త్రచికిత్సలో చివరకు రోగి మెడ నుంచి త్రిశూలాన్ని తొలగించారు. గాయంతో అంత దూరం ప్రయాణం చేసినప్పటికీ రామ్ తనకు ఎలాంటి నొప్పి లేదని చెప్పాడని వైద్యులు వెల్లడించారు. అంతేగాక ఆపరేషన్ ముందు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే బాధితుడికి త్రిశూలం ఎలా గుచ్చుకుందనే దానిపై స్పష్టత లేదు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ త్రిశూలాన్ని శ్రీ రామ్ తన ఇంట్లోని దేవుని బలిపీఠంపై ఉంచారని, తరతరాలుగా ఈ చారిత్రక త్రిశూలాన్ని పూజిస్తూ వస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఓ వ్యక్తితో భాస్కర్ రామ్‌కు చిన్న వాగ్వాదం జరిగిందని, దీంతో అతడు త్రిశూలంతో దాడి చేయడంతో భాస్కర్ రామ్ మెడ వెనుక భాగంలో గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఆప్‌కు ఎదురుదెబ్బ.. స్పందించిన కేజ్రీవాల్ -
దారుణం: దుష్ట శక్తుల పేరుతో త్రిశూలంతో వాతలు...వ్యక్తి మృతి
దుష్ట శక్తులను తొలగిస్తానంటూ ఒక వ్యక్తి మాయమాటలు చెప్పి ఒక మానసిక వికలాంగుడుని పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన చత్తీస్‌గఢ్ బిలాస్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...రతన్‌పూర్ పోలీస్టేషన్ పరిధిలోని పోడి గ్రామంలో ఫేకురామ్ నిర్మల్కర్ అనే 35 ఏళ్ల మానసిక వికలాంగడు ఉన్నాడు. అతని భార్య ఒక రషక్ అనే తాంత్రికుడిన సంప్రదించింది. అతన్ని దుష్ట ఆత్మల ప్రభావానికి లోనయ్యాడని వాటిని తొలగించాలని చెప్పాడు. దీంతో అతని వద్దకు తన భర్త ఫేకురామ్‌ని తీసుకువెళ్లింది. ఆ తాంత్రికుడు వద్దే నాలుగు రోజుల వచ్చింది. ఆ తాంత్రికుడు దుష్టశక్తులను తొలగించే పేరుతో త్రిశూలంతో వాతలు పెట్టి హింసించడం మొదలు పెట్టాడు. ఐతే ఫేకురామ్‌కి వాతలు కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చి పరిస్థితి విషమించడంతో అతని బార్య ఫేకురామ్ ఇంటికి తీసుకువెళ్లిపోయింది. ఆ తర్వాత అతను చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని హత్యనేరం కింద కేసు నమోదు చేసుకుని తాంత్రికుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: ఈవీఎం పాడవ్వడంతో తలెత్తిన ఘర్షణ...పలువురికి గాయాలు) -
త్రిశూలంతో గుచ్చి.. కళ్లు పొడిచి
రాంచీ: అంతరిక్షం అంతు చూసే ప్రయోగాలు ఓ వైపు.. అంతులేని అజ్ఞానం మరోవైపు. వెరసి నేటికి గ్రామాల్లో మంత్రాలు, చేతబడులు వంటి మూఢనమ్మకాలు బలంగా నాటుకుపోయాయి. వీటి గురించి సరైన అవగాహన లేక గ్రామాల్లో నేటికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. అనారోగ్యం పాలైన యువతిని ఆస్పత్రికి తీసుకేళ్లే బదులు భూత వైద్యం చేసే జంట దగ్గరకు తీసుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. దెయ్యాన్ని వదిలిస్తామని చెప్పి సదరు దంపతులు ఏకంగా యువతి ప్రాణాలు తీశారు. ఆ వివరాలు.. గర్వా, కొందిరా గ్రామానికి చెందిన రుద్ని దేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లే బదులు ఓ తాంత్రిక జంటను ఆశ్రయించారు. వారు రుద్ని దేవిని పరీక్షించి ఆమె శరీరంలో దెయ్యం ఉందని చెప్పి.. దాన్ని పారదోలడానికి పూజలు చేయలన్నారు. ఈ క్రమంలో త్రిశూలం తీసుకుని రుద్ని శరీరం మీద గుచ్చడమే కాక ఆమె కళ్లను కూడా పొడిచారు. అప్పటికే అనారోగ్యంతో నీరసించిన రుద్ని ఈ హింసను తట్టుకోలేక మరణించింది. దాంతో ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉండేందుకు రుద్ని కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని కాల్చేశారు. దారుణం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రుద్ని కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేశారు. అనంతరం ఓ పోలీసు ఉన్నతాధికారి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘చేతబడులు, మంత్రాలు వంటి వాటి గురించి జనాలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంటాము. కానీ మారుమూల ప్రాంతాలు, గ్రామాల్లో ఉంటున్న జనాల్లో ఇంకా మార్పు రాలేదు. దాంతో ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం అవుతూనే ఉన్నాయ’న్నారు. -
మరో వివాదంలో రాధే మా
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా కు మరోసారి చుక్కెదురైంది. త్రిశూలం ధరించి విమానంలో ప్రయాణించిన కేసులో దాఖలైన పిటిషన్ పై శుక్రవారం ముంబై హైకోర్టు స్పందించింది. ఈ కేసులో కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒక సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 18లోగా దీనికి సమాధానం చెప్పాలని జస్టిస్ విఎం కనాడే, షాలిన్ ఫానల్కార్ లతో కూడిన బెంచ్ ఆదేశించింది. ఈ ఏడాది ఆగస్టులో ఔరంగాబాద్ నుండి ముంబైకి ఓ ప్రయివేటు విమానంలో రాధే మా ప్రయాణిస్తున్న సమయంలో త్రిశూలంతో ప్రయాణించడంపై సామాజిక కార్యకర్త రమేష్ జోషి వ్యాజ్యం దాఖలు చేశారు. మారణాయుధం లాంటి త్రిశూలాన్ని విమానంలో తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ చర్య ద్వారా సివిల్ యావియేషన్ నిబంధనలను ఆమె అతిక్రమించారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాధేమా మరింత ఇరకాటంలో పడ్డారు. రాధే మా మినీస్కర్టులో ఉన్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతోపాటు డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులు, వరకట్న వేధింపులు తదితర నేరాలతో పాటు మరికొన్ని కేసుల్లో ఆమెను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. -
అది.. భూబదలాయింపే
ప్రత్యేకకోర్టుకు నివేదించిన ట్రైడెంట్ న్యాయవాది సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా పాశమైలారంలో అరబిందో ఫార్మాకు కేటాయించిన 33 ఎకరాల భూమిని అనుబంధ సంస్థకు బదలాయింపు మాత్రమే చేశారని, విక్రయించలేదని ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ కేసు నుంచి తమ పేరును తొలగించాలని కోరుతూ ట్రైడెంట్ లైఫ్‌సెన్సైస్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు ప్రధానన్యాయమూర్తి ఎన్.బాలయోగి గురువారం మరోసారి విచారించారు. ఏపీఐఐసీ నిబంధనల ప్రకారమే ట్రైడెంట్ లైఫ్‌సెన్సైస్‌కు నిర్వహణ అవసరాల్లో భాగంగా ఈ బదలాయింపు జరిగిందని ఉమమహేశ్వర్‌రావు తెలిపారు. గతంలోనూ ఇటువంటి బదలాయింపులు జరిగాయని, అనుబంధ సంస్థకు భూబదలాయింపు తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. శుక్రవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.