అది.. భూబదలాయింపే | Trident is reported in a separate court lawyer | Sakshi
Sakshi News home page

అది.. భూబదలాయింపే

Published Fri, Nov 14 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

Trident is reported in a separate court lawyer

  • ప్రత్యేకకోర్టుకు నివేదించిన ట్రైడెంట్ న్యాయవాది
  • సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా పాశమైలారంలో అరబిందో ఫార్మాకు కేటాయించిన 33 ఎకరాల భూమిని అనుబంధ సంస్థకు బదలాయింపు మాత్రమే చేశారని, విక్రయించలేదని ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు.

    ఈ కేసు నుంచి తమ పేరును తొలగించాలని కోరుతూ  ట్రైడెంట్ లైఫ్‌సెన్సైస్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు ప్రధానన్యాయమూర్తి ఎన్.బాలయోగి గురువారం మరోసారి విచారించారు. ఏపీఐఐసీ నిబంధనల ప్రకారమే ట్రైడెంట్ లైఫ్‌సెన్సైస్‌కు నిర్వహణ అవసరాల్లో భాగంగా ఈ బదలాయింపు జరిగిందని ఉమమహేశ్వర్‌రావు తెలిపారు.

    గతంలోనూ ఇటువంటి బదలాయింపులు జరిగాయని, అనుబంధ సంస్థకు భూబదలాయింపు తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. శుక్రవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement