వడదెబ్బకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
నల్లగొండ: వడదెబ్బకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన నర్సింహ (50) అనే వ్యక్తి బుధవారం కట్టెలు కొట్టడానికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. వడదెబ్బ ప్రభావంతో రాత్రి ప్రాణాలు కోల్పోయాడు.