కోతుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
కాసనగోడు(కేతేపల్లి):
కోతుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కేతేపల్లి మండలంలోని కాసనగోడు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన బొజ్జ జానయ్య బుధవారం మధ్యాహ్నం తన ఇంట్లో భోజనం చేస్తుండగా కోతులు గుంపులుగా జొరబడ్డాయి. వాటిని వెళ్లగొట్టేందుకు జానయ్య ప్రయత్నించగా ఒక్కసారిగా ఆయన మీదకు ఎగబడి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన జానయ్యను కుటంబ సభ్యులు చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.