కృష్ణానదిలో పడి యువకుడు మృతి
చామర్రు (అచ్చంపేట ) : మండలంలోని చామర్రు కృష్ణానదిలో పడి మరో వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా, చందర్లపాడు మండలం, కుందుర్తి గ్రామానికి చెందిన కె.ఏడుకొండలు (27) ఏడాదిన్నరకాలంగా చామర్రులోని అత్తగారింట్లో ఉంటున్నాడు.
చామర్రు (అచ్చంపేట ) : మండలంలోని చామర్రు కృష్ణానదిలో పడి మరో వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా, చందర్లపాడు మండలం, కుందుర్తి గ్రామానికి చెందిన కె.ఏడుకొండలు (27) ఏడాదిన్నరకాలంగా చామర్రులోని అత్తగారింట్లో ఉంటున్నాడు. ఈ నెల 18వ తేదీన భార్య రామాంజమ్మ ముగ్గురు పిల్లలతో స్వగ్రామమైన కుందుర్తి వెళ్లి తిరిగి వస్తూ, తాను నదిలో లోతు తక్కువగానే ఉంది ఈదుకుంటూ వస్తానని చెప్పి భార్య పిల్లలను పడవ ఎక్కించాడు. ఏడుకొండలు తిరిగి రాకపోవడంతో రెండు రోజులుగా బంధువులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఒక మృతదేహం చామర్రు నది ఒడ్డుకు కొట్టుకొని రాగా గ్రామస్తులు చూసి బంధువులకు చెప్పడంతో ఆ మృతదేహం ఏడుకొండలుదిగా గుర్తించారు. కోనూరులో కృష్ణానదిలో తీసిన ఇసుక గుంతలలో పడి ముగ్గురు మృతిచెంది వారం కూడా గడవక ముందే మరో వ్యక్తి నదిలో మృతి చెందడం పట్ల మండలంలో తీవ్ర చర్చనీయంశమైంది. ఈ సంఘటన కూడా ఇసుక గుంతలలో పడటం వల్లనే జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పోలీసులకు ఎటువంటి సమాచారం లేదు.