క్వారీ గుంతలో పడి యువకుడి మృతి
రావిపాటివారిపాలెం (ప్రత్తిపాడు): ప్రమాదవశాత్తూ క్వారీలో గుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన రావిపాటివారిపాలెంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం ప్రత్తిపాడు పంచాయతీ పరిధిలోని రావిపాటివారిపాలెంకు చెందిన వాసిమళ్ళ నాగేశ్వరరావు(37) సోమవారం ఉదయం పొలానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు క్వారీ గుంతలో దిగాడు. ప్రమాదవశాత్తూ కాలుజారి గుంతలో పడ్డాడు. గమనించిన స్థానికులు అతనిని బయటకు తీసి ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. మృతుడి తండ్రి జోసఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎ.బాలకష్ణ తెలిపారు.