రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | person died in road accident | Sakshi

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Oct 17 2016 12:54 AM | Updated on Aug 30 2018 4:10 PM

రోడ్డు ప్రమాదంలో కరివేన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన జోగేంద్ర ప్రసాద్‌(45) కుటుంబ సభ్యులతో కలసి ఆత్మకూరు పట్టణంలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌ను సందర్శించేందుకు ఆటోలో బయలుదేరారు.

ఆత్మకూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో కరివేన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన జోగేంద్ర ప్రసాద్‌(45) కుటుంబ సభ్యులతో కలసి ఆత్మకూరు  పట్టణంలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌ను సందర్శించేందుకు ఆటోలో బయలుదేరారు. ఆత్మకూరు నుంచి కరివేన వస్తున్న ఒక ద్విచక్రవాహనంపై కోత మిషన్‌కు సంబంధించిన పరికరాన్ని తీసుకు వస్తుండగా  ప్రమాదవశాత్తు ఆటోలో ఉన్న జోగేంద్ర ప్రసాద్‌ కాలి మడమను తాకడంతో తీవ్రగాయమైంది. చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement