పురుగు మందుతాగి వ్యక్తి ఆత్మహత్య
Published Sun, Feb 19 2017 10:32 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM
గుంటూరు రూరల్ : పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అడవితక్కెళ్ళపాడుకులోగల రాజీవ్ గృహకల్పలో నివశించే షేక్ నాగుల్‌మీరా(26)కు గత నాలుగేళ్ల కిందట స్థానికంగా నివశించే షబానాతో వివాహమైంది. నాగూల్‌మీరా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంటికి వచ్చి రాత్రి సమయంలో అందరూ నిద్రిస్తుండగా పురుగు మందుతాగాడు. దీంతో వాంతులు చేసుకుంటున్న అతనిని బంధవులు గుర్తించి చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకుగల కారణాలు తెలియవని ఇంట్లో, బయట అందరితో బాగానే ఉంటాడని భార్య తెలిపిందని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement