భార్యల పోరు తట్టుకోలేక.. | person sucide due to wives | Sakshi
Sakshi News home page

భార్యల పోరు తట్టుకోలేక..

Published Thu, Sep 1 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

person sucide due to wives

– మనస్తాపంతో భర్త ఆత్మహత్య
– సూర్యాపేట మండల పరిధిలో ఘటన
సూర్యాపేటరూరల్‌
ఇద్దరు భార్యల పోరును తట్టుకోలేక ఓ భర్త ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన  సూర్యాపేట మండలం బాలెంల ఆవాసం యర్కలతండాలో గురువారం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేటరూరల్‌ ఎస్‌ఐ జి.శ్రీనువాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యర్కలతండాకు చెందిన భూక్యా లింగయ్య(35) 2003వ సంవత్సరంలో పట్టణ పరిధి బలరాంతండాకు చెందిన మంజులను వివాహం చేసుకున్నాడు. బాబు జన్మించినంత వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం మనస్పర్థలు రావడంతో  మంజుల భర్త లింగయ్యతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది.  ఈ క్రమంలో లింగయ్య ఎనిమిది సంవత్సరాల క్రితం చివ్వెంల మండలం మున్యానాయక్‌తండాకు చెందిన సునితను రెండో వివాహం చేసుకున్నాడు. కుమారుడు, కుమార్తె జన్మించారు. అయితే లింగయ్య మెుదటి భార్య మంజులకు చెందిన వ్యవసాయభూమి యర్కలతండాలో ఉంది. అప్పుడప్పుడు మంజుల తండాకు వెళ్లిన సమయంలో సునితతో గొడవపడేది. ఈ క్రమంలో ఇటీవల ఇద్దరికీ తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. విషయాన్ని సునిత భర్త లింగయ్యతో చెప్పడంతో ఆమెపైనే చేయిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు భార్యల పోరుతో మనస్తాపం చెందిన లింగయ్య బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేరసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం గమనించిన కుటుంబసభ్యులు గమనించడంతో ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. లింగయ్య తండ్రి పంతులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement