భూ పంపిణీలో వివాదం
భూ పంపిణీలో వివాదం
Published Sat, Oct 8 2016 5:37 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి
పాల్పడిన గ్రామస్తుడు
ఈపూరు: భూములు అప్పగించే విషయంలో మండలంలోని ఇనిమెళ్ళ గ్రామంలో శుక్రవారం వివాదం చోటు చేసుకుంది. దీంతో ఒకరు పురుగు మంది తాగి ఆత్మహత్యాయత్నాకి ప్రయత్నించారు. మండలంలోని ఇనిమెళ్ళ గ్రామంలో భూములను గత నాలుగు రోజుల నుంచి పేదలకు రెవెన్యూ అధికారులు పంపిణీ చేస్తున్నారు. అధికారులు పంపిణీ చేస్తున్న భూములను గ్రామానికి చెందిన కొందరు బాగు చేసుకొని సాగు చేసుకుంటున్నారు. తాము సాగు చేసుకుంటున్న భూములను పంపిణీ చేయడానికి వీళ్లేదంటూ గ్రామానికి చెందిన బండారు దిబ్బయ్య పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో రెవెన్యూ అధికారులు అడ్డుకొని అతని వద్ద ఉన్న పురుగు మందు డబ్బాను లాక్కున్నారు. పురుగు మందు తాగిన వెంటనే ఈపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆద్వర్యంలో బొల్లాపల్లి ఎస్సై పట్టాభిరామయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సర్వేను అడ్డుకుంటున్న దిబ్బయ్య భార్యతో మాట్లాడి రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. తహశీల్దార్ ప్రశాంతి జరిగిన విషయాన్ని ఆర్డీవో రవీంద్రకు ఫోన్‌ద్వారా తెలియజేశారు. తాత్కాలికంగా పంపిణీ నిలిపవేసినట్లు తహశీల్దార్ ప్రకటించారు. మొత్తం 84 మందికి గాను 73 మంది లబ్ధిదారులకు భూముల అప్పగించినట్లు తెలిపారు. వీఆర్వో ఉమాశంకర్, సర్వేయర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement