ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి యత్నించిన వ్యక్తిని స్థానికులు దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
చోరీకి యత్నించిన వ్యక్తికి దేహశుద్ధి
Published Wed, Nov 2 2016 9:32 PM | Last Updated on Mon, Oct 8 2018 3:07 PM
పట్నంబజారు: ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి యత్నించిన వ్యక్తిని స్థానికులు దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికులు, నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనివాసరావుపేట ఐటీసీ కంపెనీ సమీపంలో నివాసం ఉండే కొత్తూరి కృష్ణకుమారి బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. గమనించిన స్థానికులు ప్రశ్నించటంతో, పొంతన లేని సమాధానమిచ్చి అక్కడ నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు.
వారిలో హరిబాబు అనే వ్యక్తి పట్టుపడగా, మరొక గుర్తు తెలియని వ్యక్తి ఉడాయించారు. దీంతో స్థానికులు దొరికిన వ్యక్తికి దేహాశుద్ధి చేసి నగరంపాలెం పోలీసులకు అప్పజెప్పారు. రెండు రోజుల కిందట శ్రీనివాసరావుపేట 6వలైనులో జరిగిన చోరీ కేసులో వీరే అనుమానితులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. స్థానికులు అప్పజెప్పిన హరిబాబు జేబులో రెండు ఉంగరాలు, కొద్దిపాటి నగదు, పలు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. రెండు రోజుల కిందట జరిగిన ఫిర్యాదు పేర్కొన్న వస్తువులేనని తెలుస్తోంది. దీనితో హరిబాబు, మరో వ్యక్తి చొరికి వచ్చినట్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కృష్ణకుమారి నివాసంలో ఎటువంటి వస్తువులు పోలేదని ఆమె చెబుతున్నారు. పరారీ అయిన రెండో వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Advertisement
Advertisement