గంజాయితో వ్యక్తి అరెస్టు
గంజాయితో వ్యక్తి అరెస్టు
గంజాయి, వ్యక్తి, అరెస్టు
gangai, person, arrest
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని బొందిలిపాలెంలో నడిచి వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి ఎకై ్సజ్ అధికారులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ బి.లత తెలిపిన వివరాల ప్రకారం వడ్డెరపాలెంలో నివాసం ఉండే తన్నీరు శంకరం వద్ద గంజాయి ఉన్నట్లు సమాచారం అందుకొని దాడిచేశారు. బొందిలిపాలెం వద్ద అతని నుంచి 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకొన్న గంజాయి విలువ సుమారు రూ.16 వేలు ఉంటుంది. దాడిలో ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ ఎస్‌ఐ ఎండీ ఖాసిం షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు.