జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీరప్పగడ్డ కాలనీలో దారుణం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌సిటీ: జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీరప్పగడ్డ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన వాటర్ పైప్‌లైన్ కోసం తీసిన గుంతలో పడి ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎవరైనా హత్య చేసి గుంతలో పడేశారా లేక ప్రమాదవశాత్తూ పడి చనిపోయారా అనేది తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.