వ్యక్తి దారుణ హత్య
వ్యక్తి దారుణ హత్య
Published Fri, Sep 30 2016 7:40 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
వెల్దుర్తి (గుంటూరు జిల్లా) బండరాళ్లతో మోది ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. వెల్దుర్తి మండలం దావుపల్లి సమీపంలో శివుని బావి వద్ద గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. హత్యపై శుక్రవారం ఉదయం సమాచారం అందుకున్న మాచర్ల రూరల్ సీఐ ఏ.శివశంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో బండరాళ్లతో మోది హత్య చేశారని గుర్తించారు. మృతుడి వివరాలు తెలియకపోవటంతో డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలకు సమాచారం అందించారు. మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్‌టీం సభ్యుల బృందం మృతదేహాన్ని పరిశీలించి, చొక్కా జేబులో ఉన్న ప్రామిసరీ నోట్ల ఆధారంగా మహంకాళి వెంకట కృష్ణ(42)గా గుర్తించారు. ఇతను ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం తెల్లకట్లకు చెందిన వాడుకాగా, వినుకొండలో నివాసం ఉంటున్నాడు. సంఘటనా స్థలం నుంచి హత్యకు ఉపయోగించిన పరికరాలను క్లూస్‌టీం సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌లో డాగ్ ఘణి మృతదేహం వద్ద నుంచి మాచర్ల–శ్రీశైలం రహదారిలో దావుపల్లి వైపు కొంత దూరం వచ్చి న ల్లమల అటవీ ప్రాంతంలోకి వెళ్లి నీటికుంట వద్ద ఆగింది. వెంకటకృష్ణ హత్యపై అతని అన్న కృష్ణమూర్తికి, బంధువులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలాన్ని గురజాల డీఎస్పీ కె.నాగేశ్వరరావు పరిశీలించారు. ఈయన వెంట గురజాల, మాచర్లరూరల్ సీఐలు ఎంవి సుబ్బారావు, ఏ.శివశంకర్, ఎసై ్సలు రవికష్ణ, సుబ్బారావు ఉన్నారు. వీఆర్‌వో ముత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement