రామాలయ ‍ప్రాంగణాన్ని శుభ్రం చేసిన నటుడు | Jackie Shroff Takes Part In Cleanliness Drive Of Oldest Ram Temple In Mumbai, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Jackie Shroff-Ram Temple: రామాలయ ‍ప్రాంగణాన్ని శుభ్రం చేసిన నటుడు

Published Tue, Jan 16 2024 1:57 PM | Last Updated on Tue, Jan 16 2024 3:06 PM

Jackie Shroff Takes Part in Cleanliness Drive of Oldest Ram Temple - Sakshi

అయోధ్యలో ఈ నెల 22న బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్‌ నటులు హాజరుకానున్నారు. ఇంతలో ఒక నటునికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్.. రామాలయ ప్రాంగణాన్ని, మెట్లను శుభ్రం చేస్తూ ఒక వీడియోలో కనిపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు జాకీష్రాఫ్‌ను మెచ్చుకుంటున్నారు. 

66 ఏళ్ల జాకీ ష్రాఫ్ ముంబైలో జరిగిన పురాతన రామాలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. రామునిపై ఆ నటునికి ఉన్న భక్తిని, అతని సింప్లిసిటీని అభిమానులు కొనియాడుతున్నారు.

‘ఎక్స్‌’లో షేర్‌ చేసిన ఈ వీడియోను యూజర్స్‌ అమితంగా ఇష్టపడుతున్నారు. పలువురు అభిమానులు రకరకాలుగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఒక యూజర్‌ జాకీని ఉద్దేశించి ‘జీరో నుంచి హీరోగా మారిన వ్యక్తి’ అని కామెంట్‌ చేయగా, మరొకరు, 'కెమెరా ముందు.. కెమెరా వెనుక అత్యంత వినయుడు' అని రాశారు. 

జాకీ ష్రాఫ్ అప్పుడప్పుడు పలు సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. నిరుపేద చిన్నారులకు వైద్య చికిత్స చేయించేందుకు, అలాంటి వారికి విద్య అందించేందుకు జాకీష్రాఫ్‌ విరాళాలు అందిస్తుంటారు. ఆయన సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement