ఆ యాక్సిడెంట్ చేసింది ఓ కుక్క! | Dog drives car into store | Sakshi
Sakshi News home page

ఆ యాక్సిడెంట్ చేసింది ఓ కుక్క!

Published Wed, Aug 3 2016 10:08 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఆ యాక్సిడెంట్ చేసింది ఓ కుక్క! - Sakshi

ఆ యాక్సిడెంట్ చేసింది ఓ కుక్క!

వర్జీనియా: యజమాని లేని సమయంలో ఇదే అదునుగా భావించి కారు నడిపిన ఓ కుక్క యాక్సిడెంట్ చేసింది. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటనలో.. ఓ షాపింగ్ మాల్ ప్రాంగణంలోకి దూసుకొచ్చిన కారు కాంక్రిట్ పిల్లర్ను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా కారు వైపు పరిగెత్తి చూడగా.. అందులో మనుషులెవరూ లేకుండా, కేవలం రెండు కుక్కలు మాత్రమే ఉండటంతో షాక్ తిన్నారు.

అనంతరం అక్కడకు చేరుకున్న ఓ మహిళ ఆ కారు తనదే అని.. అందులో ఉన్నది తన పెంపుడు కుక్కలని వెల్లడించింది. తాను షాపింగ్ మాల్లోకి వెళ్లిన సమయంలో కుక్కలు ఈ పని చేశాయని తెలిపింది. రెండు కుక్కల్లో ఒకటి ఎలా చేసిందో గానీ.. కారును స్టార్ట్ చేసి గేరు వేయటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కారు మాత్రం దెబ్బతింది. దీంతో సదరు మహిళపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement