సాక్షి, న్యూఢిల్లీ : 25 సంవత్సరాల వయసులోనే మీరు మిలియనీర్ కావాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ నేర్చేసుకోండి అట. వచ్చే ఏళ్లలో ప్రపంచాన్ని నడిపించేది ఈ రెండేనట. ఇప్పటికే సిలికాన్ వ్యాలీ కంపెనీలు ఈ రెండు తెలిసిన వారికి భారీ ఎత్తున ప్యాకేజీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఫేస్‌బుక్, గూగుల్ లాంటి కంపెనీలు ఈ ఏఐ, మిషన్ లెర్నింగ్ తెలిసిన వారికి ఏడాదికి 5 లక్షల డాలర్లకు పైగా ప్యాకేజీతో తమ కంపెనీల్లోకి రిక్రూట్ చేసుకుంటున్నాయని తెలిసింది. ఇప్పటి వరకు ఈ రెండు పూర్తిగా తెలిసిన వారు కేవలం 10వేల మంది నిపుణులు మాత్రమే ఉన్నారని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిఫియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే అతిపెద్ద ట్రెండ్‌లని రిపోర్టులు తెలిపాయి. ఏఐ టాలెంట్ ఉన్న వారికి టెక్ దిగ్గజాలు ఎంత ప్యాకేజీ ఇవ్వడానికైనా వెనుకాడటం లేదని తెలిసింది.
న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు ప్రకారం.. కేవలం ఇంజనీరింగ్, మాస్టర్ లెవల్ డిగ్రీ, తక్కువ ఏళ్ల అనుభవమున్నా ఏఐ స్పెషలిస్టు అయితే వారికి 3 లక్షల డాలర్ల నుంచి 5 లక్షల డాలర్ల వేతనాలను సిలికాన్ వ్యాలీ కంపెనీలు చెల్లిస్తున్నాయట. ఒకవేళ ఏఐ ప్రాజెక్టులో అనుభవం వచ్చిన తర్వాత గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ లాంటి కంపెనీలైతే మిలియన్ వేతనాలైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయని రిపోర్టు తెలిపింది. ప్రస్తుతం వారికి అంతలా డిమాండ్ ఉందని పేర్కొంది. ఇటీవల కాలంలో ఏఐ, మిషన్ లెర్నింగే టెక్ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని తెలిపింది. వీటిల్లో నిపుణులైన వారు పెద్ద పెద్ద సమస్యలను కూడా ఏఐ, మిషన్ లెర్నింగ్‌తో పరిష్కరించవచ్చని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు తమ విద్యార్థులకు ఏఐను ఆఫర్ చేయడం ప్రారంభించాయి. మిషన్ లెర్నింగ్, ఏఐపై తమ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఐఐటీ-హైదరాబాద్ స్పెషల్ కోర్సును కూడా ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment