క్లస్టర్స్ గేమ్స్‌లో జిల్లా నెంబర్‌వన్
క్లస్టర్స్ గేమ్స్‌లో జిల్లా నెంబర్‌వన్
Published Sat, Aug 20 2016 12:32 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM
నిజాంసాగర్ : రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర నవోదయ క్లస్టర్స్ గేమ్స్‌లో నిజామాబాద్ జిల్లా జవహార్ నవోదయ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించారు. బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, క్రికెట్, చెస్, టేబుల్‌టెన్నీస్, యోగా, రోప్‌స్కిప్పింగ్‌లో పోటీలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో ఉ త్తమ ప్రతిబ కనబర్చి, రీజనల్ క్రీడలకు నిజామాబాద్ నుంచి 66 మంది విద్యార్థులు ఎంపికై, క్లస్టర్ స్థాయిలో గెలిచి జిల్లాను నంబర్‌వన్‌గా నిలిపారు. అలాగే మహబూబ్‌నగర్ నవోదయ విద్యాలయం నుంచి 28 మంది విద్యార్థులు రీజనల్ క్రీడలకు ఎంపికై, క్లస్టర్ గేమ్స్‌లో రెండో స్థానంలో నిలిచారు. శుక్రవారం సాయంత్రం నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయం లో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. విజేతలకు నవోద య ప్రిన్సిపాల్ శేఖర్‌బాబు, పూర్వ విద్యార్థుల చేతుల మీదుగా షీల్డ్‌లు అందజేశారు. తెలంగాణ నవోదయ విద్యాలయల నుంచి 310 మంది విద్యార్థుల క్లస్టర్స్ గేమ్స్‌లో పాల్గొన్నారు. అందులో నుంచి 232 మంది విద్యార్థులు రీజనల్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 23, 24 తేదీల్లో కేంద్రీయ నవోదయ విద్యాలయ సమితి అధ్వర్యంలో రీజినల్ క్రీడలు జరుగుతాయి. క్లస్టర్ గేమ్స్‌లో సేవలందించిన పీఈటీలకు, టీచర్లకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో నవోదయ వైస్ ప్రిన్సిపాల్ శోభనవల్లి, ఉపాధ్యాయులు శేషు పీఈటీలు బాబురావ్, నిరుపారాణి పూర్వ విద్యార్థులు నాగేందర్ తదితరులున్నారు.
Advertisement