నాణ్యమైన విద్యకు నవోదయం
నాణ్యమైన విద్యకు నవోదయం
Published Wed, Aug 10 2016 9:57 PM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM
కలిదిండి :
గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యనందించి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏర్పాటు చేసిన జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2017–18 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘జేఎన్‌వీఎస్’ సెలక్షన్ టెస్ట్–2017 పేరుతో ప్రకటన జారీ చేసింది. జిల్లాలోని వేలేరులో జవహర్ నవోదయ విద్యాలయంలో సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హత.....
జిల్లాలో నివాసం ఉండే విద్యార్థులే అర్హులు. విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. విద్యార్థి మే 1, 2004 నుంచి ఏప్రిల్ 30, 2008 మధ్య కాలంలో జన్మించి ఉండాలి. ఈ నిబంధన ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్ని వర్గాలకు వర్తిస్తుంది. 2016–17లో ఐదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తేనే 2017–18లో నవోదయ విద్యాలయంలో ప్రవేశం కల్పించనున్నారు.
సీట్ల కేటాయింపు..
గ్రామీణ ప్రాంత విద్యార్థుకు 75 శాతం సీట్లు, 25 శాతం పట్టణ ప్రాంత విద్యార్థులతో భర్తీ చేస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల కోటాలో సీట్లు పొందాలంటే సంబంధిత ప్రాంతాల్లో విద్యార్థి 3,4,5 తరగతులు చదివి ఉండాలి.
రిజర్వేషన్...
మొత్తం సీట్లలో 15 శాతం ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు, 1/3 వంతు బాలికలకు, 3 శాతం సీట్లు దివ్యాంగులతో భర్తీ చేస్తారు.
ఎంపిక ... విధానం
ఒక్కసారి ప్రవేశ పరీక్షకు హాజరైన వారు రెండోసారి రాసేందుకు అనర్హులు.
ప్రవేశ పరీక్షలో ఎంపికైన విద్యార్థులు ప్రవేశానికి ముందే జూలై, 2017 లోపు నవోదయ విద్యాసమితి నియామవళిలో తెలిపిన విధంగా సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అందించాలి. పూరించిన దరఖాస్తులు సంబం«ధిత పాఠశాల హెచ్‌ఎం ద్వారా ఎంఈవోలకు సమర్పించాలి. ప్రవేశపరీక్షలో విద్యార్థి పొందిన మార్కులు (ఎంపికైనా, కాకున్నా) తెలియజేయరు. జవాబు పత్రాలు తిరిగి పరిశీలించడానికి, తిరిగి మార్కులు లెక్కించడానికి అవకాశం ఉండదు. 8వ తరగతి వరకు మాతృభాషలో బోధిస్తారు. విద్యార్థులు 10, 12 తరగతి పరీక్షలు సీబీఎస్సీ సిలబస్ చదవాల్సి ఉంటుంది.
పరీక్ష వి«ధానం...
రెండు గంటల వ్యవధిలో ఉండే ఈ పరీక్షలో మూడు విభాగాలుంటాయి. మొత్తం వంద మార్కులకు వంద ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తులు అందించాల్సిన చివరి తేదీ : 16–09–2016, ప్రవేశ పరీక్ష తేదీ : 08–01–2017, పరీక్ష ఫలితాలను 2017 మే నెలలో విడుదల చేస్తారు. దరఖాస్తులు వేలేరు నవోదయ విద్యాలయం, అన్ని డీఈవో, ఎంఈవోల వద్ద ఉచితంగా లభిస్తాయి.
వెబ్‌సైట్ www.navodya.nic.in, www.navodyagov.in దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి.
ప్రయోజనాలు ఇలా....
ఒకసారి ప్రవేశం పొందిన విద్యార్థులు 12వ తరగతి వరకూ చదివేందుకు అవకాశం కల్పిస్తారు. బాలబాలికలకు విడిగా వసతి ఉంటుంది. బోధనతోపాటు వసతి, ఆహారం, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం ఉచితంగా అందిస్తారు. క్రీడలు, యోగా, ఎస్‌సీసీ, సంగీతం, చిత్రకళ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తారు. కంప్యూటర్ విద్యతోపాటు, వీశాట్, ఎడ్యుసొసైటీ కనెక్టవిటీ, లైబ్రరీ, ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
Advertisement
Advertisement