సాక్షి, హైదరాబాద్: ప్రగతినగర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలకు ‘ప్రగతి– డాక్టర్ చుక్కా రామయ్య’ టెస్ట్‌ను ఏప్రిల్ 3న నిర్వహించనున్నట్లు ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య చెప్పారు. శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించేందుకు ప్రగతి నగర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో తమవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రగతినగర్ సొసైటీల్లో ఐఐటీ, జేఈఈ, నీట్ అకాడమీలో ప్రవేశం కోసం ఏప్రిల్ 3న తెలంగాణలోని జిల్లాల్లో ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఏప్రిల్ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు 91000 92345ను సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎ. నర్సిరెడ్డి, ప్రగతి నగర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు కె. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పి. చంద్రశేఖర్‌రెడ్డి, కరస్పాండెంట్ డి. దయాకర్‌రెడ్డి, విద్యాసంస్థల ప్రతినిధి సాంబశివరావు పాల్గొన్నారు. (క్లిక్: ఆర్టీసీ చార్జీల బాదుడు.. ఏ స్టాప్‌కు ఎంత పెంచారంటే?)
Comments
Please login to add a commentAdd a comment