ఎస్కేయూ : పీజీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న రాత పరీక్ష ఫలితాలు రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. పరీక్ష పూర్తయిన సబ్జెక్టులకు ‘ కీ ’వెరిఫికేషన్ పూర్తి అయిందన్నారు. రాత పరీక్షలు శుక్రవారం ముగిస్తాయన్నారు. ఇదిలా ఉండగా , గురువారం పరీక్ష కేంద్రాన్ని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీఎన్ కృష్ణా నాయక్ పరిశీలించారు.