ఐటీఐ పూర్తి చేసినవారికి పాలిటెక్నిక్‌లో ప్రవేశం
Published Sun, Dec 11 2016 1:34 AM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM
అనంతపురం : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో రెండేâýæ్ల కోర్సు పూర్తి చేసి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నేరుగా పాలిటెక్నిక్ రెండవ సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఐటీఐల్లో 2017, జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి వరకూ బ్రిడ్జి కోర్సులో శిక్షణ ఇస్తారు. దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఏ ఐటీఐలో చేరదలిచారో ఆయా ఐటీఐల్లో దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అనంతపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో సంప్రదించాలని సూచించారు.
Advertisement
Advertisement