రేపటి నుంచి సెట్స్‌ షురూ | Entrance Exams In Telangana Will Start From 31st Of This Month. | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి సెట్స్‌ షురూ

Published Sun, Aug 30 2020 1:14 AM | Last Updated on Sun, Aug 30 2020 9:34 AM

Entrance Exams In Telangana Will Start From 31st Of This Month. - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం 31న ఈసెట్‌ నిర్వహించేం దుకు జేఎన్‌టీయూ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్ష తర్వాత సెప్టెంబర్‌ 2న పాలిసెట్, 9 నుంచి 14 వరకు ఇంజనీరింగ్‌ ఎంసెట్, ఆ తర్వాత పీజీ ఈసెట్, అగ్రికల్చర్‌ ఎంసెట్, ఐసె ట్, ఎడ్‌సెట్, లాసెట్‌ నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమ వారం జరిగే ఈసెట్‌కు 28,015 మంది విద్యార్థులు హాజరు కాను న్నారు. ఈ పరీక్షను రెండు విడతల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ మంజూర్‌ హుస్సేన్‌ తెలిపారు.

అందులో ఉద యం (9 నుంచి 12 వరకు) జరిగే పరీక్షకు 14,415 మంది, మధ్యా హ్నం (3 నుంచి సా. 6 వరకు) జరి గే పరీక్షకు 13,600 మంది హాజర వుతారన్నారు. తెలంగాణలో 56, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష సమయం కంటే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. ఈ విషయాన్ని విద్యార్థుల హాల్‌టికెట్‌పై కూడా ఇచ్చామని, వీలైనంత ముం దుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌తో పాటు కాలేజీ ఐడీ కార్డు/ఆధార్‌/డ్రైవింగ్‌ లైసెన్స్‌/పాన్‌కార్డు/ పాస్‌పోర్టు/ఓటర్‌ ఐడీ వంటి వాటిల్లో ఏదో ఒకటి తెచ్చుకోవాలన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement