
సాక్షి, విజయవాడ: ఏపీ వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (ఏపీ సెట్స్) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం తాడేపల్లిలో విడుదల చేశారు. ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశపరీక్షలను నిర్వహించనున్నారు. ఐసెట్‌ను ఏప్రిల్ 27, ఈసెట్ ఏప్రిల్ 30న, పీజీ ఈసెట్ మే 2,3,4, తేదీల్లో నిర్వహిస్తారు. లాసెట్‌ను మే 8, ఎడ్‌సెట్ 9న నిర్వహించనున్నారు. ఏపీబీ ఆర్కిటెక్చర్ కోర్సుల కోసం నేరుగా అడ్మిషన్లు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సురేష్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment