
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఐదో తరగతి అడ్మిషన్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలపై ఉత్కంఠ వీడలేదు. పరీక్ష నిర్వహించి నెల గడిచినా ఫలితాలు వెలువడలేదు. సాధారణంగా గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి అడ్మిషన్లకు సంబంధించి ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటివారంలో పరీక్ష నిర్వహించి నెలాఖరు కల్లా ఫలితాలు ప్రకటిస్తారు. జూన్ మొదటి వారంలోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేది. కానీ ఈ ఏడాది కరోనా నేపథ్యంలో మార్చి నుంచి విద్యా సంస్థలు మూతబడటం, ఇప్పటికీ వాటిని తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోవడంతో పరీక్ష నిర్వహణలో తీవ్ర జాప్యం జరిగింది.
ఈ క్రమంలో పలుమార్లు పరీక్షకు సంబంధించిన దరఖాస్తును పొడిగించిన అధికారులు.. కోవిడ్ తీవ్రత కాస్త సద్దుమణిగిన తర్వాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నవంబర్ 1న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 50 వేల సీట్లుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈక్రమంలో నవంబర్ రెండో వారంలో ఫలితాలు ప్రకటించి, నెలాఖరు కల్లా అడ్మిషన్లు పూర్తి చేయాలని భావించారు.
బోధనపైనా ప్రభావం..
విద్యా సంవత్సరం ప్రారంభమై ఆర్నెల్లు కావొస్తున్నా గురుకుల ఐదో తరగతిలో ఇంకా ప్రవేశాలు జరగకపోవడంతో బోధన ముందుకు సాగడం లేదు. ఇది విద్యార్థుల అభ్యాసనపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment