
విజయనగరం జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన బడే మెహర్ సాత్విక్ నాయుడు జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్ సాధించాడు.
విజయనగరం అర్బన్: ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ) ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలో విజయనగరం జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన బడే మెహర్ సాత్విక్ నాయుడు జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్ సాధించాడు. బాడంగి మండలం రామచంద్రపురంకు చెందిన సాత్విక్ జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదువుతున్నాడు. సాత్విక్ గతంలోనూ 6వ తరగతి ప్రవేశ పరీక్షల్లో జాతీయ స్థాయి మొదటి ర్యాంక్ సాధించాడు. సాత్విక్ తల్లిదండ్రులు లక్ష్మి, సుగుణాకరనాయుడు, తాత సంజీవనాయుడు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఈ సందర్భంగా సాత్విక్ మాట్లాడుతూ నావికాదళంలో ఉన్నత స్థాయి అధికారిగా పనిచేసి దేశానికి సేవలందించాలన్నదే తన లక్ష్యమని తెలిపాడు.
(చదవండి: హాల్ టిక్కెట్లను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి)