జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో మూడున్నరేళ్ల చిన్నారి సాంబార్ డేక్షాలో పడి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పిట్లం మండలం బీసీ గురుకుల పాఠశాలలో శోభ, యాదులు అనే దంపతులు వంట మనుషులుగా పనిచేస్తున్నారు. వీరికి కీర్తన అనే మూడున్నరేళ్ల కూతురు ఉంది. కుటుంబమంతా ఆ వంట గదిలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు.