Cookers
-
తక్కువ నూనె, ఎక్కువ రుచి.. తక్కువ సమయం, ఎక్కువ వంటకాలు.. ధర?
తక్కువ నూనె, ఎక్కువ రుచి.. తక్కువ సమయం, ఎక్కువ వంటకాలు.. ఇలా ప్రతి దానిలోనూ ప్రత్యేకంగా నిలుస్తోంది ఈ గ్రిల్. దీని పేరు గ్లాస్ ఓవెన్ కుకర్. సురక్షితమైనది. సౌకర్యవంతమైనది. 60–250 డిగ్రీల సెల్సియస్ మధ్య టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. గ్లాస్ మెటీరియల్‌తో రూపొందిన ఈ డివైజ్‌లో.. సాధారణ మెషిన్స్ కంటే 25% వేగంగా వంట పూర్తి అవుతుంది. డివైజ్ మూతకు.. పైభాగంలో రెగ్యులేటర్స్, ఆప్షన్స్‌తో పాటు.. లోపలి భాగంలో మోటర్ అటాచ్ అయ్యి ఉంటుంది. దీనిలో చిప్స్, రింగ్స్, హోల్ చికెన్ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. ఈ మేకర్ని గ్రిలర్లా, బేకర్లా, రోస్టర్లా వినియోగించుకోవచ్చు. ఇందులో తయారైన ఆహారానికి ఎలాంటి నూనె, పిండి వాసనలు రావు. పైగా దీనిలో సెల్ఫ్ క్లీనింగ్ మోడ్ ఆప్షన్ ఉండటంతో పాత్రలను వేరు చేసి.. క్లీన్ చెయ్యాల్సిన శ్రమా ఉండదు. -ధర : 49 డాలర్లు (రూ.3,895) చదవండి: Decoration Ideas: వినాయకుడి ప్రతిమను పెట్టే చోట ఇలా అలంకరిస్తే.. Ganesh Chaturthi- Palavelli: వినాయక చవితి.. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే! -
అటు కుక్కర్లు.. ఇటు ప్లాస్టిక్ స్టూళ్లకు డిమాండ్
అమలాపురం టౌన్: పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని మార్కెట్లో కుక్కర్లు...ప్లాస్టిక్ స్టూల్స్కు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డుల అభ్యర్థులకు ఈ గుర్తులను కేటాయించడంతో ఆయా అభ్యర్థుల్లో కొందరు ఓటర్లకు తమ గుర్తును తెలియజేస్తూ వారికి నిజమైన కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ నజరానాగా ఇచ్చేస్తున్నారు. ఎన్నికల్లో కేటాయించిన గుర్తుల నమూనాలు అవసరమైతే పెద్దవిగా తయారు చేయించి ఓటర్లను ఆకర్షించేలా ప్రదర్శిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన ఉంగరం, కత్తెర, మంచం తదితర గుర్తులను పెద్దవిగా నమూనా తయారు చేయించి వాటినే ప్రచారాల్లో విరివిగా ఉపయోగించుకుంటున్నారు. కొందరు సర్పంచ్ అభ్యర్థులు బుల్లి మంచాల నమూనాలు, లేదా వాస్తవ మంచాలతోనే ప్రచారం చేస్తున్నారు. వార్డుల అభ్యర్థులకు కేటాయించిన కొన్ని గుర్తుల్లో ముఖ్యంగా కుక్కర్, స్టూలు గుర్తులను నమూనాగానే కాకుండా అసలైన కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్‌ను కొనుగోలు చేసి మరీ ఓటర్లకు అందిస్తున్నారు. నాలుగో విడతగా అమలాపురం డివిజన్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలు గ్రామాల్లోని వార్డుల్లో ఈ వ్యవహారం నడుస్తోంది. వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో చాలా మంది తమకు గుర్తులు కేటాయించిన తక్షణమే ఇలా కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ కొనుగోళ్లు చేయడంతో మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది. పి.గన్నవరం మండలంలోని ఓ మేజర్ పంచాయతీలో రెండు వార్డుల్లో పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ తొలి రోజు కొనుగోలు చేసి కొందరు ఓటర్లకు పంచిపెట్టినా, మర్నాడు మిగిలిన ఓటర్లకు పంచిపెట్టేందుకు మార్కెట్‌కు వెళితే కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ స్టాక్ లేదన్న సమాధానంతో నిరుత్సాహ పడ్డారు. కోనసీమలో అన్ని మండలాల్లో ముఖ్యంగా మేజర్ పంచాయతీల వార్డుల అభ్యర్థుల్లో చాలా మంది కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ ఇచ్చే ఓట్లు అడుగుతున్నారు. ఇలా ఇస్తున్న గ్రామాల్లో ఓటర్లు చమత్కారంగా జోక్‌లు వేసుకుంటున్నారు. ఉంగరం (రింగ్) గుర్తు వచ్చిన సర్పంచ్ అభ్యర్థులు ఒక్కో బంగారం ఉంగరం ఓటర్లకు ఇస్తే ఎంత బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. -
సాంబార్ గిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి మృతి
-
వేడి సాంబార్లో పడి చిన్నారి మృతి
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో మూడున్నరేళ్ల చిన్నారి సాంబార్ డేక్షాలో పడి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పిట్లం మండలం బీసీ గురుకుల పాఠశాలలో శోభ, యాదులు అనే దంపతులు వంట మనుషులుగా పనిచేస్తున్నారు. వీరికి కీర్తన అనే మూడున్నరేళ్ల కూతురు ఉంది. కుటుంబమంతా ఆ వంట గదిలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే ఈ రోజు(శనివారం) విద్యార్థులకు వంటలు సిద్దం చేశారు. వంటలో భాగంగా సాంబర్ చేసి డేక్షాను పక్కన పెట్టారు. అంతలో అక్కడికి ఆడుకుంటూ వచ్చిన కీర్తన అకస్మాత్తుగా ఆ సాంబార్ వండిన డేక్షా(గిన్నె, బగోనే) లో పడి పోయింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం పిట్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి చివరకు ప్రాణాలు వదిలింది. కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. -
‘పానాసోనిక్’ రంగుల కుక్కర్లు
చెన్నై, సాక్షి ప్రతినిధి: గృహోపకరణాల విభాగంలో వినూత్న శ్రేణి కుక్కర్లను మార్కెట్లోకి విడుదల చేసినట్టు పానాసోనిక్ మేనేజింగ్ డెరైక్టర్ హిడనేరి సో పేర్కొన్నారు. ఆయన శుక్రవారం రాష్ట్ర మార్కెట్లోకి రంగుల కుక్కర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జనరల్ మేనేజర్ షెనాయ్, చీఫ్ ఫ్యాక్టరీ ఆఫీసర్లతో కలిసి ఆయన మాట్లాడారు. విదేశీ విడి వస్తువులతో నిమిత్తం లేకుండా భారత్‌లోనే పూర్తిస్థాయి తయారీ తమ ప్రత్యేకతన్నారు. అందుకే వినియోగదారుల సం ఖ్య ఇటీవల కోటి దాటిందని చెప్పారు. ప్రతి వస్తువులోనూ కొత్తదనాన్ని అందించాలనే తపనతో స్పెక్ట్రమ్ రేంజ్ పేరుతో తొలిసారిగా ఏడు రంగుల్లో కుక్కర్లు విడుదల చేశామన్నారు. పూర్తి గా మెటాలిక్ రంగుల్లో కుక్కర్ల శ్రేణి దేశంలోనే ప్రథమని తెలిపారు. 150 గ్రాములు మొదలుకుని 4.5 కిలోల సామర్థ్యం గల కుక్కర్లను ప్రవేశపెట్టామని తెలిపారు. వంటగ్యాస్ ఖర్చుతో పోల్చుకుంటే 40 శాతం ఆదా అని చెప్పారు. వీటి ధర రూ.1899 నుంచి రూ.12,990 వరకు ఉందన్నారు. పానాసోనిక్తోపాటు ఏ కంపెనీ కుక్కరైనా అందజేసి ఎక్సేంజ్ విధానంతో కొత్త కుక్కర్‌ను పొందవచ్చని తెలిపారు. చెన్నైలోని తమ ఉత్పత్తి కేంద్రం 25 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు వారు తెలిపారు.