మెదక్: ఓ పాఠశాలలో దయ్యాలున్నాయనే నెపంతో క్షుద్ర పూజలు నిర్వహించిన ఘటన గజ్వేల్ గురువారం చోటు చేసుకుంది. అది ఒక గురుకుల పాఠశాల. పాఠశాల అంటే విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన చోటు. మూడ నమ్మకాలపై అపోహలు తొలింగించాల్సిన దేవాలయంలాంటి బడిలో దెయ్యాలున్నాయంటూ అలజడి సృష్టించారు. ఈ కథనాన్ని వెలుగులోకి తీసుకరావడంతో అసలు విషయం బయటపడింది.
దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ వెంటనే గురుకుల పాఠశాలను సందర్శించి ఆరా తీశారు. పాఠశాలలో క్షుద్రపూజలు చేయడమేమిటని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. అసలు అక్కడ ఏం జరిగిందనే అంశంపై పాఠశాల విద్యార్థులందర్నీరప్పించాలని ఆదేశించారు. ఈ ఘటనపై డీఈఓ రమేష్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.