ఏకలవ్య జాతీయ క్రీడల ఏర్పాట్లపై రాజీ పడొద్దు  | Kantilal Dande Said Should Not Compromise Eklavya National Games | Sakshi
Sakshi News home page

ఏకలవ్య జాతీయ క్రీడల ఏర్పాట్లపై రాజీ పడొద్దు 

Published Wed, Dec 14 2022 9:39 AM | Last Updated on Wed, Dec 14 2022 9:53 AM

Kantilal Dande Said Should Not Compromise Eklavya National Games - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్వహించనున్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల మూడవ జాతీయ క్రీడల ఏర్పాట్లలో ఎక్కడా రాజీ పడొద్దని రాష్ట్ర గురుకుల సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే స్పష్టంచేశారు. విజయవాడ లయోలా కళాశాలలో ఈ క్రీడలకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు జరగనున్న క్రీడల విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

కళాశాల ప్రాంగణంలోని ఫుట్‌ బాల్, హాకీ, బాస్కెట్‌ బాల్‌ కోర్టులను పరిశీలించిన కాంతిలాల్‌ దండే అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఫాదర్‌ జీఏపీ కిశోర్, సీనియర్‌ అథ్లెటిక్‌ కోచ్‌ వినాయక్‌ ప్రసాద్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నాగేంద్ర ప్రసాద్, గిరిజన సంక్షేమ, శాప్‌ అధికారులు ఉన్నారు. 

(చదవండి: చెత్తతో ‘పవర్‌’ ఫుల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement