Kantilal
-
ఏకలవ్య జాతీయ క్రీడల ఏర్పాట్లపై రాజీ పడొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్వహించనున్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల మూడవ జాతీయ క్రీడల ఏర్పాట్లలో ఎక్కడా రాజీ పడొద్దని రాష్ట్ర గురుకుల సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే స్పష్టంచేశారు. విజయవాడ లయోలా కళాశాలలో ఈ క్రీడలకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు జరగనున్న క్రీడల విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కళాశాల ప్రాంగణంలోని ఫుట్ బాల్, హాకీ, బాస్కెట్ బాల్ కోర్టులను పరిశీలించిన కాంతిలాల్ దండే అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఫాదర్ జీఏపీ కిశోర్, సీనియర్ అథ్లెటిక్ కోచ్ వినాయక్ ప్రసాద్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్, గిరిజన సంక్షేమ, శాప్ అధికారులు ఉన్నారు. (చదవండి: చెత్తతో ‘పవర్’ ఫుల్) -
144వ సెక్షన్ ఎత్తివేత
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పట్టణంలో 144వ సెక్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు కలెక్టర్ కాంతిలాల్ దండే బుధవారం ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో విజయనగరంలో ఈ నెల 4వ తేదీ నుంచి 144వ సెక్షన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. సమైక్య ద్రోహిగా పేర్కొంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు చెందిన ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్న ఆరోపణలతో పట్టణంలో వారం రోజుల పాటు కర్ఫ్యూ అమలు చేశారు. అనంతరం కర్ఫ్యూను ఎత్తివేసినప్పటికీ 144వ సెక్షన్‌ను అమలు చేశారు. జిల్లా కేంద్రంలో గుంపులుగా తిరగకూడదని, ఎటువంటి నిరసనలు తెలపకూడదని హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. ఇదే తరుణంలో పోలీసులు అరెస్ట్‌ల పర్వం మొదలు పెట్టారు. స్థానిక కాంగ్రెస్ నేతల జోక్యంతోనే పోలీసులు అరెస్ట్‌లు చేస్తున్నారని సామాన్య ప్రజానీకంతో పాటూ అఖిలపక్షం, ఉద్యోగ సంఘాల నాయకుల పలుమార్లు కలెక్టర్ కాంతిలాల్ దండేకు వినతిపత్రాలు అందజేశారు. ఇదే విషయమై బుధవారం కూడా దళిత సంఘాల నాయకులు, న్యాయవాదులు డీఆర్వో బి.హేమసుందర వెంకటరావుకు వినతిపత్రాలు అందించారు. 144వ సెక్షన్ విధించటం సరికాదంటూ నిరసన వ్యక్తం చేశారు. మంత్రి బొత్స కూడా కర్ఫ్యూ, 144వ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడే తన పర్యటనలు పూర్తి చేశారు. అమ్మవారి ఉత్సవాల నుంచి జిల్లా కేంద్రంలోనే గడిపిన బొత్స పలువురు మంత్రులను సైతం జిల్లాకు రప్పించి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. దాదాపు పర్యటనలు పూర్తి కావటం, మరోవైపు నిరసనలు వెల్లువెత్తటంతో స్పందించిన అధికారులు ఎట్టకేలకు బుధవారం సాయంత్రం నుంచి నుంచి 144వ సెక్షన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యమానికి సన్నద్ధం.. ఎట్టకేలకు పట్టణంలో 144వ సెక్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటన రావడంతో సమైక్య రాష్ట్రం కోసం గురువారం నుంచి ఉద్యమం చేసేందుకు ఉద్యోగ, న్యాయవాద సంఘాలతో పాటు సమైక్యవాదులు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చినప్పటికీ 144వ సెక్షన్ అమల్లో ఉండటంతో కనీసం శాంతియుత నిరసన తెలిపేందుకు కూడా అవకాశం లేకుండాపోయిందని సమైక్యవాదులు చెబుతున్నారు. అరెస్ట్‌ల పర్వానికి కూడా తెరదించి జిల్లాలో శాంతిపూర్వక వాతావరణం నెలకొల్పాలని వారు కోరుతున్నారు.