వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలంలో పొలానికి దారి ఏర్పాటు విషయమై జరిగిన కొట్లాటలో 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
కమలాపురం : వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలంలో పొలానికి దారి ఏర్పాటు విషయమై జరిగిన కొట్లాటలో 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మండలంలోని గంగవరం గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. కత్తులు, కర్రలతో దాడులు చేసుకోవటంతో రెండు వర్గాలకు చెందిన వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కమలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, వివరాలు సేకరిస్తున్నారు.