ప్రకృతి ప్రకోపం.. | Hence, on the other hand, has the nature | Sakshi
Sakshi News home page

ప్రకృతి ప్రకోపం..

Published Mon, Jun 2 2014 2:22 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM

ప్రకృతి ప్రకోపం.. - Sakshi

ప్రకృతి ప్రకోపం..

ఒకవైపు భానుడు భగభగ మండుతుండగా.. మరో వైపు ప్రకృతి విలయతాండవం చేసింది. వేలాది ఎకరాల్లోని ఉద్యానపంటలు నేలమట్టమయ్యాయి.

 ఒకవైపు భానుడు భగభగ మండుతుండగా.. మరో వైపు ప్రకృతి విలయతాండవం చేసింది. వేలాది ఎకరాల్లోని ఉద్యానపంటలు నేలమట్టమయ్యాయి. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, టవర్లు, నేలకొరిగాయి. బలంగా వీచిన ఈదురుగాలులతో అన్నదాతలకు కోలుకోలేని దెబ్బతగిలింది. అధికారులు నష్టాన్ని అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం ఆదుకోవాలని రైతులు కన్నీటితో వేడుకుంటున్నారు.     
 
 కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్: జిల్లాలోని కమలాపురం మండలం నసంతపురం, లేటపల్లె, జంగంపల్లె, పొడదుర్తి, వై.కొత్తపల్లె గ్రామాల్లోనూ, మైదుకూరు మండలంలోని వనిపెంట, విశ్వనాథపురం, బ్రహ్మంగారిమఠం మండలంలోని బి.మఠం, మల్లేపల్లె, బి.కోడూరు మండలంలోని మున్నెల్లి, కడప నగర పరిధిలోని కడప, పాతకడప, మోడమీదపల్లె, దళితవాడలో విద్యుత్ స్తంభాలు విరిగిపడి భారీ నష్టం సంభవించింది. మోడమీదపల్లె దళితవాడలోని పెంకుటిల్లు, సిమెంట్ రేకుల ఇళ్లు గాలి దుమారానికి లేచిపోయి కొంతమంది ప్రజలకు గాయాలయ్యాయి.
 
 మైదుకూరు మండలంలోని విశ్వనాథపురంలో చెట్టు విరిగిపడి మూడు బర్రెలు మృతిచెందాయి. అలాగే రెండు ఎకరాల్లోని బొప్పాయి తోట నేలమట్టమైంది. బి.మఠం మండలంలోని పలు గ్రామాల్లో మిరపతోటలు దెబ్బతిన్నాయి. కమలాపురం మండలంలోని నసంతపురంలో 40 ఎకరాల్లో ఆకుతోటలు నేలమయ్యాయి. అదేవిధంగా కడప నగర సమీపంలోని పాతకడప వద్ద సాగులో ఉన్న కౌలు రైతు నరసింహులు ఆకుతోట రెండు ఎకరాల్లో, మిరప రెండు ఎకరాల్లో నేలవాలింది. పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు, నాగాయపల్లె, నందిమండలం, చీమలపెంట, కొత్త గంగిరెడ్డిపల్లె గ్రామాల్లో అరటి, మామిడి పంటలు నేలమట్టమయ్యాయి. దీంతో ఉద్యాన తోటలకు దాదాపు రూ.60 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.
 
 విద్యుత్ శాఖకు భారీ నష్టం :
 జిల్లాలోని కడప, కమలాపురం, మైదుకూరు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు గాలికి క్రింద పడిపోయాయి. పాతకడప వద్ద పొలాల్లో ఎక్కడ చూసినా విరిగిపడిన విద్యుత్  స్తంభాలే దర్శనమిస్తున్నాయి. భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలపై పడడంతో మోయలేని భారాన్ని తట్టుకోలేక విద్యుత్ వైర్లు తెగి పడిపోయాయి. అదేవిధంగా ట్రాన్స్‌ఫార్మర్లు కూడా దెబ్బతిన్నాయి. జిల్లాలో మొత్తం 20 సబ్‌స్టేషన్ల నుంచి సరఫరా ఆగిపోయినట్లు దక్షిణ మండల విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ నందకుమార్ తెలిపారు. అలాగే జిల్లాలో 114 పల్లెలకు కరెంటు సరఫరా దెబ్బతిందని తెలిపారు. ఇదే సందర్భంలో యుద్ద ప్రాతిపదికన 103 గ్రామాలకు సరఫరా పునరుద్ధరించామన్నారు. 33కెవి ట్రాన్స్‌ఫార్మర్లు 17, 11 కెవి ట్రాన్స్‌ఫార్మర్లు 107 దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రానికల్లా సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement