వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో బాబాసాబ్ అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కడప : వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో బాబాసాబ్ అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన మాట వినకుండా భార్య సౌదీకి వెళ్తానంటూ మొండిపట్టు పట్టడంతో బాబాసాబ్ తీవ్ర మనస్థాపానికి గురైయ్యాడు. దీంతో బుధవారం ఉదయం ఆయన రైలు పట్టాలపై పొడుకున్నాడు.
స్థానికులు ఆ విషయాన్ని గమనించి... బాబాసాబ్ను రైలు పట్టాలపై నుంచి తప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన పట్టినపట్టు వీడలేదు. ఇంతలో అదే ట్రాక్పైకి వచ్చిన రైలును స్థానికులు ఆపివేశారు. దీంతో బాబాసాబ్కు తృటిలో ప్రమాదం తప్పింది.