వైఎస్సార్ జిల్లా కమలాపురం సమీపంలో కారు ఢీకొని ఓ బాలిక మృతి చెందింది.
కమలాపురం : వైఎస్సార్ జిల్లా కమలాపురం సమీపంలో కారు ఢీకొని ఓ బాలిక మృతి చెందింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి చెందిన మంగమ్మ, కారుమంచిలు కూలి పనులకోసం వైఎస్సార్‌జిల్లా కమలాపురం మండలానికి వలస వచ్చారు. వీరి కుమార్తె తేజావతి(8) సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బాలిక అక్కడికక్కడే మరణించింది. దాంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.