యోగి వేమన యూనివర్సిటి అంతర్ కళాశాల క్రీడా పోటీలు ఆదివారం రసవత్తరంగా సాగాయి. స్థానిక సీఎసెస్‌ఆర్ అండ్ ఎస్‌ఆర్‌ఆర్‌ఎం డిగ్రీ కళాశాలలో రెండో రోజు టేబుల్ టెన్నిస్, వాలిబాల్, ఖోఖో, చెస్ పోటీలు నిర్వహించారు.
కమలాపురం అర్బన్: యోగి వేమన యూనివర్సిటి అంతర్ కళాశాల క్రీడా పోటీలు ఆదివారం రసవత్తరంగా సాగాయి. స్థానిక సీఎసెస్‌ఆర్ అండ్ ఎస్‌ఆర్‌ఆర్‌ఎం డిగ్రీ కళాశాలలో రెండో రోజు టేబుల్ టెన్నిస్, వాలిబాల్, ఖోఖో, చెస్ పోటీలు నిర్వహించారు. క్రీడా కారులు గెలుపుకోసం హోరాహోరీగా తలపడ్డారు. టేబుల్ టెన్నిస్ మహిళల సింగల్,డబుల్స్ లలో వివిధ కళాశాల జట్లు పాల్గొన్నాయి. వాలిబాల్, ఖోఖో, చెస్ పోటీల్లో క్రీడాకారులు తలపడ్డారు. వైవీయూకు చెందిన స్పోర్ట్స్ బోర్డు సెక్రటరి రామసుబ్బారెడ్డి, కోఆర్డినేటర్ డాక్టర్ చాంద్‌బాషా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
విజేతలు విరే :
టేబుల్ టెన్నిస్: విన్నర్: పి. వెంకటేశ్వర్లు( ఎస్‌బివిఆర్ డిగ్రీ కాలేజ్ బద్వేల్)
రన్నర్ : ఎ. శ్రీ హరి(ప్రభుత్వ డిగ్రీ కళాశాల రైల్వే కొడూరు )
మహిళల సింగిల్స్ విభాగం విన్నర్ : ఎ. శ్రీలక్ష్మీ ( ఎస్‌కెఆర్ అండ్‌ఎస్‌కెఆర్ కడప)
రన్నర్: కె. మమత ( సిఎస్‌ఎస్‌ఆర్, ఎస్‌ఆర్‌ఆర్‌ఎం, కమలాపురం)
డబుల్స్ పురుషుల విభాగం
విజేత: బి. మహమ్మద్ రఫి, పి. వెంకటేశ్వర్లు, జె.జీవన్ కుమార్( ఎస్‌బివిఆర్ బద్వేల్)
రన్నర్ : ఎస్. సయ్యద్ హుస్సేన్, పెద్ద స్వామి, బాలాజి నాయక్( వైవీయూ)
మహిళల డబుల్స్ విభాగం
విన్నర్ కె. మమత, ఈశ్వరమ్మ, ఆర్. లక్ష్మీదేవి( సిఎస్‌ఎస్‌ఆర్, ఎస్‌ఆర్‌ఆర్‌ఎం, కమలాపురం)
రన్నర్: బి. సుబాసిణి,టి. శ్రీవాణి, ఎం. స్వాతి( వైవీయూ)
ఖోఖో లో ఆర్‌సిపిఈ ప్రొద్దుటూరు, సిఎస్‌ఎస్‌ఆర్, ఎస్‌ఆర్‌ఆర్‌ఎం ,కమలాపురం, వైవియూ కడప, ఆర్‌సిపిఈ ప్రొద్దుటూరు జట్లు ఫైనల్‌కు చేరాయి. వాలీబాల్‌లో జియోన్ కాలేజ్ కడప, ఆర్‌సిపిఈ ప్రొద్దుటూరు జట్లు ఫైనల్లో ప్రవేశించాయి. ఆర్‌సిపిఈ ప్రొద్దుటూరు, వైవియూ కడప, ఎస్‌ఎల్‌ఎస్‌డిసి పుల్లారెడ్డిపేట, సిఎస్‌ఎస్‌ఆర్, ఎస్‌ఆర్‌ఆర్‌ఎం, కమలాపురం సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.