ఎర్రగుంట్లలో జరిగిన చోరీ కేసులో కమలాపురం కోర్టు ఇద్దరికి ఏడాది జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ లక్ష్మినారాయణ తెలిపారు.
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్లలో జరిగిన చోరీ కేసులో కమలాపురం కోర్టు ఇద్దరికి ఏడాది జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ లక్ష్మినారాయణ తెలిపారు. 2014 జనవరిలో ఎర్రగుంట్లలోని న్యూకాలనీలో నివాసం ఉండే గుత్తి రామచంద్రారెడ్డి ఇంటిలో చోరీ జరిగింది. సుమారు 30 తులాల బంగారును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ కేసులో నిందితులైన అనంతరపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామానికి చెందిన అబ్దుల్ గఫూర్, వేముల మండలం చింతలజూటురు గ్రామానికి చెందిన రామిరెడ్డి నరేష్‌రెడ్డిలకు ఈ మేరకు శిక్ష విధించినట్లు ఆయన పేర్కొన్నారు.