కడపలోని ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ శేషుబాబు ఫిర్యాదు మేరకు ఎస్‌బీఐ పులివెందుల, కమలాపురం బ్రాంచ్‌లలో మేనేజర్‌గా పని చేసిన ఆర్‌ఎస్‌ఎస్ శ్రీనివాసరావుతోపాటు అతనికి సహకరించిన మరో నలుగురిపై మంగళవారం చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
కడప: కడపలోని ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ శేషుబాబు ఫిర్యాదు మేరకు ఎస్‌బీఐ పులివెందుల, కమలాపురం బ్రాంచ్‌లలో మేనేజర్‌గా పని చేసిన ఆర్‌ఎస్‌ఎస్ శ్రీనివాసరావుతోపాటు అతనికి సహకరించిన మరో నలుగురిపై మంగళవారం చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. కోటి రూపాయలకు పైగా మొత్తాన్ని కమలాపురంలో 17 మందికి, పులివెందులలో నలుగురికి తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి రుణాలు ఇచ్చారని రీజినల్ మేనేజర్ శేషుబాబు గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.