బీఆర్‌ఎస్‌ ఎంపీపై దాడి కాంగ్రెస్ పార్టీ చేయించిందే: నిరంజన్ రెడ్డి | Attack On BRS MP Was Done By Congress Party Niranjan Reddy Says | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఎంపీపై దాడి కాంగ్రెస్ పార్టీ చేయించిందే: నిరంజన్ రెడ్డి

Published Tue, Oct 31 2023 5:00 PM | Last Updated on Tue, Oct 31 2023 6:02 PM

Attack On BRS MP Was Done By Congress Party Niranjan Reddy Says - Sakshi

హైదరాబాద్‌:  దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి  కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి కాంగ్రెస్ పార్టీ చేయించిందేనని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జనాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ హింసను  ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. సంస్కారం లేని వాడిలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పరుష పదజాలంతో స్థాయి మరిచి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీ తాము తప్ప ఎవరూ అధికారం చేయొద్దు అనే రీతిలో వ్యవహరిస్తోందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని తెలిపారు. అహింస పద్దతిలో తెలంగాణ సాధించుకున్నామని పేర్కొన్నారు. 

కేసిఆర్ ను వ్యూహాత్మకంగా ఢీకొట్టలేక హింసాత్మక సంఘటనలకు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోందని నిరంజన్ రెడ్డి అన్నారు. అందుకే నిన్న మా ఎంపీపైన కత్తితో దాడి చేశారని మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్ నగర్లో  బీఆర్ఎస్ 14 స్థానాలు గెలుచుకునే సత్తా ఉందని తెలిపారు. పక్క పార్టీల్లో విశ్వాసం కోల్పోయే పరిస్తితి కి వచ్చిందని అన్నారు. 

ఇదీ చదవండి: పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ జరపాలి: సీఎం కేసీఆర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement