
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు రూ. 36 వేల వరకు రుణాలున్న 5.42 లక్షల మంది రుణాలు మాఫీ చేశామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈ బడ్జెట్‌లో రూ. 90 వేల వరకున్న రుణాల మాఫీకి రూ. 6,385 కోట్లు కేటాయించామన్నారు.
శాసనసభలో ఆదివారం సభ్యులు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బిగాల గణే‹Ù, నలమోతు భాస్కర్‌రావు, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, దుర్గం చిన్నయ్య, పొడెం వీరయ్య తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామన్నారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ కొల్లాపూర్ మండలం రాంపూర్‌లో రూ. 5.45 కోట్లతో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని, త్వరలోనే అక్కడ మార్కెట్ నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment