
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని అయోవా రాష్ట్రం – తెలంగాణ మధ్య పరస్పర సహకారం ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ లో లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్‌తో భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయక రాష్ట్రంగా పేరుగాంచిన అయోవాకు, తెలంగాణకు అనేక సారూప్యతలున్నాయన్నారు.
రెండు రాష్ట్రాలూ ఆహారధాన్యాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, మాంసోత్పత్తిలో నంబర్ వన్‌గా నిలిచాయని, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాల్లో పరస్పర సహకారానికి అవకాశాలున్నాయని చెప్పారు. పలు విధాన నిర్ణయాల ఫలితంగా రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరిగిందన్నారు. తెలంగాణ సాధించిన విజయాలు గర్వించదగ్గవని ఆడమ్ కితాబిచ్చారు.
తెలంగాణలో ఐదు విప్లవాలు
అనంతరం నిరంజన్‌రెడ్డి అయోవా సెక్రటరీ ఆఫ్ అగ్రికల్చర్ మైక్ నెయిగ్‌ను కలిశారు. రాష్ట్రంలో రెండో హరిత విప్లవం ద్వారా ధాన్యం ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగిందని, పాడి పరిశ్రమ అభివృద్ధి ద్వారా శ్వేత విప్లవం, చేపల పెంపకంలో వృద్ధి సాధించి నీలి విప్లవం సాధించామని చెప్పారు. అలాగే, మాంసోత్పత్తిలో రికార్డు సృష్టించి పింక్ రెవల్యూషన్ సాధించిన తెలంగాణ, ఇప్పుడు నూనె గింజల ఉత్పత్తిలో పసుపు విప్లవాన్ని సాధించే దిశగా పురోగమిస్తోందని వివరించారు.
తెలంగాణ సాధించిన అయిదు విప్లవాల గురించి విన్న మైక్ నెయిగ్ త్వరలోనే రాష్ట్రాన్ని సందర్శించి ఈ విజయాలను స్వయంగా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. అలాగే ప్రపంచంలోనే పేరెన్నికగన్న వ్యవసాయ వర్సిటీ అయిన అయోవా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్‌ను మంత్రి సందర్శించారు. వర్సిటీ ప్రెసిడెంట్ వెండీ వింటర్‌స్టీన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
అయోవా వర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల మధ్య స్టూడెంట్, ఫ్యాకల్టీ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రాం ఉండాలనే చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment