
గోదాంను ప్రారంభిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులు
జడ్చర్ల: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం జడ్చర్ల మున్సిపాలి టీలోని నాగసాల శివారులో సింగిల్‌విండో వ్యవసాయ గోదాంను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. నిరంజన్‌రెడ్డి మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ సంస్కరణల ఫలితంగా సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు.
తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో గోదాంల నిల్వసామర్థ్యం 70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పెంచామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ అధ్యక్షుడు వాల్యానాయక్, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, బాదేపల్లి సింగిల్ విండో చైర్మన్ సుదర్శన్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment