
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి కరోనా సోకింది. రెండ్రోజులుగా ఆయనకు దగ్గు, స్వల్ప జ్వరం ఉండటంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, సోమవారం పాజిటివ్ అని తేలిందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ మంత్రుల క్వార్టర్ట్స్‌లోని తన నివాసంలో నిరంజన్‌రెడ్డి హోంక్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు స్వల్ప జ్వరం, దగ్గు ఉన్నట్లు సన్నిహితులు వెల్లడించారు.
కాగా, మూడురోజుల కిందట వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డికి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. అలాగే వ్యవసాయ కమిషనరేట్‌లోని పేషీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు, కొందరు వ్యవసాయ అధికారులు కూడా కరోనా బారినపడ్డారు. ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్ తదితర వ్యవసాయ అనుబంధ విభాగాల్లోనూ కొందరు ఉద్యోగులకు కరోనా వచ్చింది. దీంతో వారితో ఇటీవల సన్నిహితంగా ఉన్నవారు ఆందోళనకు గురవుతున్నారు. వారు కూడా ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చదవండి: కరోనా ఉధృతి : టీకా కోసం పడిగాపులు
క్యా కరోనా: ఒకరా ఇద్దరా.. అందరిదీ అదే పరిస్థితి!
Comments
Please login to add a commentAdd a comment