మరి కొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది.. అంతకంటే ముందు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ.. అవన్నీ ఈ రోజు (డిసెంబర్ 27) నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశంలో అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్ అయిన SBI తాజాగా కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వరిస్తాయని ఎస్‌బీఐ వెల్లడించింది.
SBI కొత్త వడ్డీ రేట్లు
- 7 రోజుల నుంచి 45 రోజులకు - 3.50 శాతం
- 46 రోజుల నుంచి 179 రోజులకు - 4.75 శాతం
- 180 రోజుల నుంచి 210 రోజులు - 5.75 శాతం
- 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ - 6 శాతం
- 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ - 6.80 శాతం
- 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ - 7.00 శాతం
- 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ - 6.75 శాతం
- 5 సంవత్సరాలు & 10 సంవత్సరాల వరకు - 6.50 శాతం
సీనియర్ సిటిజన్స్ ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు
- 7 రోజుల నుంచి 45 రోజులకు - 4 శాతం
- 46 రోజుల నుంచి 179 రోజులకు - 5.25 శాతం
- 180 రోజుల నుంచి 210 రోజులకు - 6.25 శాతం
- 211 రోజుల నుంచి 1 సంవత్సరాల లోపు - 6.5 శాతం
- 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు - 7.30 శాతం
- 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు - 7.50 శాతం
- 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు - 7.25 శాతం
- 5 సంవత్సరాలు & 10 సంవత్సరాల వరకు - 7.5 శాతం
SBI ఇప్పడు తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది, అయితే ఇప్పటికే డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకుల జాబితాలో.. బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, డీసీబీ బ్యాంక్ వంటివి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment