న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రుణాలపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణరేటు (ఎంసీఎల్‌ఆర్) 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. ఆగస్టు 15 నుంచి తాజా 0.1% రుణ రేటు పెరుగుదల అన్ని వర్తిస్తుందని తన వెబ్‌సైట్‌లో బ్యాంక్ పేర్కొంది. దీనితో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన కస్టమర్ల రుణాల వడ్డీరేట్లు స్వల్పంగా పెరగనున్నాయి. తాజా రేట్లను పరిశీలిస్తే..
⇒ ఆటో, వ్యక్తిగత రుణాలకు సాధారణంగా వర్తించే ఏడాది కాలపరిమితి ఎంసీఎల్‌ఆర్ 8.85% నుంచి 8.95%కి పెరిగింది.
⇒ రెండేళ్ల రేటు 9.05%కి, మూడేళ్లరేటు 9.10 శాతానికి ఎగసింది.
⇒ నెల, మూడు, ఆరు నెలల కాలపరిమితుల రేట్లు 8.45 శాతం–8.85 శాతం శ్రేణిలో ఉంటాయి. ఓవర్‌నైట్ కాలపరిమితి రేటు 8.10 శాతం నుంచి 8.20 శాతం ఎగసింది.
⇒ పీఎన్‌బీ రుణ రేటు ఇటీవలే అన్ని కాలపరిమితులపై 5 బేసిస్ పాయింట్లు పెరగ్గా, బీఓఐ కేవలం బెంచ్‌మార్క్ ఏడాది రుణ రేటును ఇదే స్థాయిలో 0.05 శాతం పెంచింది. ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ కూడా రుణ రేట్లను అన్ని కాలపరిమితుల 5 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజాగా ఎస్‌బీఐ మూడవసారి పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment