త్వరలో రాబోయే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఎస్‌బీఐ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో కొనుగోలు చేసే వస్తువుల మీద 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ను తన వినియోగదారులకు ఇచ్చేందుకు దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సోమవారం ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తో చేతులు కలిపింది. ఈ సేల్ ఎప్పటి లాగానే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 24 గంటల ముందుగానే ప్రారంభమవుతాయి.
కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో ఈ ఏడాది ముందుగానే రిపబ్లిక్ డే సేల్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి ఏడాది గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ ఈనెల 20 నుంచి ప్రారంభమై 23న ముగుస్తుంది. కానీ, ఈ ఏడాది మాత్రం జనవరి 16-17 నుంచి ప్రారంభమవుతాయని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. అయితే, ఈ రిపబ్లిక్ డే సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువుల మీద 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తే, ఫ్యాషన్ వస్త్రాల మీద 80 శాతం డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. కాగా, ఈ సేల్‌లో ముఖ్యంగా లేటేస్ట్ ఫోన్లు అయిన వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ, ఐక్యూ జెడ్ 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మొబైల్ ఫోన్ల యాక్సెసరీలపై 40 శాతం వరకు రాయితీలు ఇస్తోంది. ఇక ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ తన ప్రకటనలో పేర్కొంది.
(చదవండి: రెనాల్ట్ కార్లపై బంపరాఫర్.. రూ.40 వేల వరకు డిస్కౌంట్!)
Comments
Please login to add a commentAdd a comment